రష్మీ గౌతమ్ – సుడిగాలి సుధీర్ వీరి ఇద్దరి గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ఈ జంట జబర్దస్త్ వేదికపై కలిశారు. బుల్లితెర మీద ఒక పాపులర్ జోడీగా పేరు పొందారు., ఏ ఈవెంట్ జరిగినా, ఏ పండగ వచ్చినా ఈ ఇద్దరిపై షూట్ చేసిన సాంగ్స్, ఫన్నీ సన్నవేషాలు సోషల్ మీడియా లో వైరల్ అవుతూ ఉంటాయి. దీంతో రష్మీ- సుధీర్ జంట కి యూత్‌లో సూపర్ ఫాలోయింగ్ ఉంది. ఇక నిత్యం సోషల్ మీడియాలో వీళ్ళ మధ్య ఎఫైర్, పెళ్లికి సంబంధించిన విషయాలైతే ఎక్కడోచోట కనిపిస్తూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా యాంకర్ రష్మీ సుధీర్‌తో మ్యారేజ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
సోషల్ మీడియా లో వీరిద్దరికి ఉన్న ఫాలోయింగ్ కారణంగా వీరికి భారీ క్రేజ్ దక్కింది. బుల్లితెరపై వీళ్లిద్దరి రిలేషన్ ను ఓ రేంజ్ జోకులేస్తూ జబర్దస్త్ సిబ్బంది వినోదం పంచుకోవడం మనం చూస్తుంటాం. ఇక రష్మీ- సుధీర్ రిలేషన్‌పై యూట్యూబ్‌లో అయితే వీడియోలు పుట్టలుపుట్టలుగా ఉన్నాయి. ఒకప్పుడు అయితే ఏకంగా రష్మీ- సుధీర్ సీక్రెట్‌గా పెళ్లి కూడా చేసుకున్నారని కూడా కొంతమంది చెప్పుకొచ్చారు. అయితే చాలా సార్లు తప్పుడు ప్రచారాల విషయమై రష్మీ స్పందించి ఇలాంటివి నొమ్మోదంటూ చెప్పుకొచ్చింది. అయితే ఇటీవల ఆమె చేసిన కామెంట్స్ కాస్త ఆసక్తికరంగా ఉండడంతో ప్రస్తతం ఈ ఇష్యూ హాట్ టాపిక్ అయింది.
ఏదైనా ఈవెంట్లో ఈ ఇద్దరు కనిపిస్తే చాలు ముందు అందరికి వచ్చే ప్రశ్న వారి రిలేషన్, పెళ్లి గురించి. ఈ నేపథ్యంలో రష్మీ ఓ కార్యక్రమానికి హాజరుకాగా ఎప్పటిలాగే సుధీర్‌తో పెళ్లి గురించి అక్కడి యాంకర్ అడగగా దీని కి సూటిగా సమాధానం ఇచ్చింది రష్మీ. ‘నాకూ తెలుసు జనాలు మా ఇద్దరి పెళ్లి జరగాలని కోరుకుంటున్నారని కానీ ప్రస్తుతం నా ఆలోచనలు, ప్లాన్స్ అన్నీ కెరీర్‌పై మాత్రమే ఉన్నాయి’ అని క్లారిటీ ఇచ్చింది రష్మీ.