ట్రెండింగ్ న్యూస్

Extra Jabardasth: సుడిగాలి సుధీర్ ను చెడుగుడు ఆడేసుకుంటున్న రష్మీ?

rashmi punches to sudigali sudheer in extra jabardasth
Share

సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మీ జంటకు తెలుగు బుల్లితెర మీద ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఉన్న డిమాండే వేరు. అందుకే.. వాళ్లిద్దరు ఏ షోలో మెరిసినా సరే.. ఆ షోకు టీఆర్పీ రేటింగ్స్ అదిరిపోతాయి. వాళ్లిద్దరూ కలిసి చాలా షోలలోనూ పార్టిసిపేట్ చేస్తుంటారు.

rashmi punches to sudigali sudheer in extra jabardasth
rashmi punches to sudigali sudheer in extra jabardasth

ఎక్స్ ట్రా జబర్దస్త్ కు యాంకర్ రష్మీ అని తెలుసు కదా. అదే షోలో సుధీర్.. స్కిట్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు వేరే వాళ్ల స్కిట్ లోనూ మెరుస్తుంటాడు. అలా ఈ సారి బుల్లెట్ భాస్కర్ స్కిట్ లో కాసేపు మెరిశాడు. ఆ స్కిట్ లో హీరోగా యాక్ట్ గా చేశాడు సుధీర్. సుధీర్ కు కథ చెప్పడానికి బుల్లెట్ భాస్కర్ వెళ్లగా… పొట్టి నరేష్ ఆయన మేనేజర్ గా ఉండి… 2030 వరకు బాబుకు డేట్స్ ఖాళీ లేవు అని చెబుతాడు.

దీంతో.. అదేంటి.. మొన్న లాక్ డౌన్ సమయంలో కూడా అందరూ ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు అన్ని షూటింగ్ అలు కూడా లేవు. 2030 దాకా డేట్స్ ఖాళీ లేకపోవడమేంటని భాస్కర్ ప్రశ్నిస్తాడు.

వెంటనే రష్మీ అందుకొని అందరూ ఖాళీ ఉండొచ్చు కానీ.. ఆ సార్ మాత్రం ఖాళీ ఉండడు. ఆ సార్ కు అసలు ఖాళీ టైమే దొరకదు అంటూ రష్మీ పంచ్ వేసేసరికి.. స్టేజ్ మొత్తం నవ్వులే నవ్వులు.

రష్మీ.. సుధీర్ పై ఇలాంటి పంచులు వేయడం ఇదే మొదటి సారి కాదు.. చాలా స్కిట్లలో సుధీర్ ను మాట్లాడనీయకుండా.. మధ్యమధ్యలో ఇలా పంచ్ లు వేస్తుంటుంది రష్మీ. సుధీర్ గాలి తుస్సుమని తీసేస్తుంటుంది. మొత్తానికి రష్మీ.. సుధీర్ ను చెడుగుడు ఆడేసుకుంటోందని నెటిజన్లు కోడై కూస్తున్నారు.

తాజాగా రిలీజయిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోను మీరు కూడా చూసేయండి..


Share

Related posts

రజనీ డైలాగ్ వైకాపా స్లోగన్ అంటున్న ట్రిపుల్ ఆర్… తెరపైకి హిందూ నినాదం!

CMR

తీవ్రవాయుగుండం:కోస్తాకు వర్ష సూచన

somaraju sharma

బ్యాడ్ టైం అంటున్న బాలయ్య బాబు..!!

sekhar