విజయ్ దేవరకొండ – రష్మిక గురించి వచ్చినన్ని రూమర్స్ బహుశా ఈ మధ్య కాలంలో ఏ హీరో, హీరోయిన్ మధ్యనా రాలేదేమో. వీరిద్దరినీ లింక్ చేస్తూ ఎన్నో రూమర్స్ వచ్చాయి. వీళ్ళిద్దరూ లవ్ లో ఉన్నారని, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటారని అన్నారు. కర్ణాటకలో అయితే రక్షిత్ శెట్టి ఫ్యాన్స్ ఈ విషయంలో బాగా హర్ట్ అయిపోయారు కూడా.
రక్షిత్ శెట్టితో ఎంగేజ్మెంట్ చేసుకుని వివిధ కారణాల వల్లన ఆ బంధం విడిపోయింది. ఆ వ్యవహారం తర్వాత రష్మిక తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరస విజయాలను అందుకుని ఆనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. ఛలో సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది రష్మిక. అయితే ఆమె స్టార్ ను మార్చిన సినిమా మాత్రం గీత గోవిందం. ఆ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కాంబినేషన్ కు మంచి పేరొచ్చింది. వాళ్ళిద్దరి కెమిస్ట్రీ భలే కుదిరింది.
అయితే రష్మిక మందన్న ఈ సినిమా ఆఖర్లో విజయ్ కు లిప్ లాక్ ఇస్తుంది. దీనికి కూడా కన్నడ ప్రేక్షకుల నుండి విమర్శలు వచ్చాయి. కొంత కాలానికే విజయ్, రష్మిక కలిసి మళ్ళీ నటించారు. డియర్ కామ్రేడ్ లో వీరి కెమిస్ట్రీ మరో రేంజ్ లో ఉంటుంది. ఘాటు సన్నివేశాలు కూడా ఉంటాయి. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ ఇంట్లో జరిగిన ప్రైవేట్ పార్టీకు రష్మిక అటెండ్ అవ్వడం అనేది చర్చనీయాంశమైంది. విజయ్ దేవరకొండ మదర్ పుట్టినరోజు జరిగింది.
అది ఆమెకు 50వ పుట్టినరోజు కావడంతో ఘనంగానే చేసారు. ఈ పుట్టినరోజుకు రష్మిక అటెండ్ అయింది. దీన్ని బట్టే అర్ధమవుతోంది విజయ్ కు రష్మిక ఎంత దగ్గరి స్నేహితురాలో అని. కొంత మంది కలిసి నటించినా అది ప్రొఫెషనల్ గానే ఉంచుతారు. మరికొంత మంది మాత్రమే పర్సనల్ గా కూడా కనెక్ట్ అవుతారు. విజయ్ కు రష్మిక అలాంటి స్నేహితురాలే తప్ప వారి మధ్య మరొకటి లేదు.