Rashmika mandanna : రష్మిక మందన్న లక్కీ హీరోయిన్ అని చెప్పాలి. ఇండస్ట్రీకొచ్చిన అతి కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది. యంగ్ హీరోలతో సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న కి అదృష్ఠం కొద్ది హిట్స్ ఎక్కువగా దక్కాయి. దాంతో ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కి జంటగా నటించే అవకాశం అందుకుంది. ఇలాంటి అవకాశం అంటే ఏ హీరోయిన్ అయినా ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అదే రష్మిక కెరీర్ లో జరుగింది. గత ఏడాది వచ్చిన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో సూపర్ స్టార్ మహేష్ బాబు తో నటించి ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకుంది.
ఈ సినిమా తర్వాత రష్మిక మందన్న భీష్మ సినిమా తో మరో భారీ హిట్ అందుకుంది. దాంతో రష్మిక మందన్న ఏ హీరో తో సినిమా చేసినా హిట్ గ్యారెంటీ అన్న ముద్ర పడిపోయింది. దాంతో మేకర్స్ రష్మిక మందన్న డేట్స్ కోసం పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే ఏకంగా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పుష్ప అన్న సినిమా లో నటించే అవకాశం అందుకుంది. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది. అంతేకాదు బాలీవుడ్ లో రెండు భారీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది. ఇప్పటికే ఒక సినిమా సెట్స్ మీదకి వచ్చింది.
Rashmika mandanna : అత్యాశే అయినా రష్మిక కి ఉన్న టాలెంట్ కి ఈ బయోపిక్స్ లో తీసుకోవచ్చు ..!
ఇక తమిళంలో కూడా రష్మిక మందన్న క్రేజీ ఆఫర్స్ అందుకుంటోంది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న రెమ్యూనరేషన్ కూడా భారీగా అందుకుంటోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ 2 కోట్ల కి తగ్గడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా రష్మిక మందన్న ఒక హాట్ న్యూస్ బయటకి చెప్పింది. అలనాటి స్టార్ హీరోయిన్స్ సౌందర్య, శ్రీదేవి ల బయోపిక్స్ తీస్తే మాత్రం ఖచ్చితంగా తనే నటించాలని ఆరాట పడుతోంది. ఇది అత్యాశే అయినా రష్మిక కి ఉన్న టాలెంట్ కి ఈ బయోపిక్స్ లో తీసుకోవచ్చు అన్న మాట కూడా వినిపిస్తోంది. మరి రష్మిక మందన్న ఆశ నెరవేరుతుందా లేదా చూడాలి.