Rashmika Mandanna: రష్మిక మందన్న.. ప్రస్తుతం టాలీవుడ్లో పాగా వేసిన గ్లామర్ హీరోయిన్. కన్నడ ‘కిరిక్ పార్టీ’ అనే సినిమాలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకున్న ఆమె మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా తరువాత రష్మిక వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కడినుండి వరుస అవకాశాలు టాలీవుడ్లో రావడంతో ఇక్కడ పూర్తిగా తిష్టవేసింది. ‘ఛలో’ సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయం అయి విజయ్ దేవరకొండ ‘గీత గోవిందం’ సినిమాతో తెలుగు వారికి మరింత చేరువైంది రష్మిక.
Rashmika Mandanna: అభిమానులకు మరింత దగ్గరగా హీరోయిన్ రష్మిక మందన..!!
Rashmika Mandanna: రష్మిక అండ్ రక్షిత్ శెట్టి మేటర్?
కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ హీరో రక్షిత్ శెట్టితో ఆమె ప్రేమలో పడి నిశ్చితార్థం కూడా చేసుకున్న సంగతి విదితమే. ఇక ఆ తర్వాత దాన్ని వీరు రద్దు చేసుకున్నారు. అయితే దానికి గల కారణాలు మాత్రం వీరు ఇంతవరకు ఎక్కడా బయటపెట్టలేదు. తాజాగా ఆమె తన యూట్యూబ్ ఛానల్లో వేదికగా నెటిజన్లతో లైవ్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా రష్మికకు ఫ్యాన్స్ నుంచి రకరకాల ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ క్రమంలో ‘మీ ఎక్స్ లవ్, ఎంగేజ్ మెంట్ బ్రెకప్ పై తెలుసుకోవాలని ఉంది’ అంటూ ఓ నెటిజన్ ప్రశ్న వేసాడు…
Rashmika Mandanna: రష్మిక ప్రేమ పాఠాలు.. అది చాలా కష్టమంటూ ఓపెన్ కామెంట్స్!
రష్మిక సమాధానం ఏమిటి?
అయితే ఆ ప్రశ్నకు రష్మిక ఎలాంటి బదులివ్వలేదు. దీంతో అసలు ఎందుకు రష్మిక మండన్న నిశ్చితార్థం ఎందుకు బ్రేక్ అయిందనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రష్మిక హీరో విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్నట్టు ఎప్పటి నుంచో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కన్నడ మూవీ ‘కిర్రిక్ పార్టీ’ హీరో రక్షిత్ తో రష్మికకు 2018లో నిశ్చితార్థం అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఆమె నటించిన గీతా గోవిందం మూవీ అనంతరం రక్షిత్‌తో ఎంగేజ్‌మెంట్‌ను బ్రేక్ చేసుకుంది. ఇక అప్పటినుండి ఈమె విజయ్ తో రోలేషన్లో ఉందని రూమర్లు నడుస్తున్నాయి.