Rashmika: తెలుగులో గీతా గోవిందం ఈ సినిమాతో ప్రేక్షకుల మనసుల్ని దోచేసిన రష్మిక పుష్ప సినిమాతో వారికి ఇంకా మరింత దగ్గరయ్యింది. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ద్వారా సూపర్ ఫేమస్ అయిన బాలీవుడ్లో కూడా అడుగుపెట్టింది. సాధారణంగా ఏ హీరోయిన్ అయినా బాలీవుడ్లో యాక్ట్ చేయాలంటే గ్లామర్ బాట పట్టాల్సిందే. ప్రస్తుతం రష్మిక కూడా అదే బాటలో నడుస్తుంది. బాలీవుడ్ హీరోయిన్స్ బికినీ వేసుకొని హాలీవుడ్ హీరోయిన్స్‌కి పోటీ ఇస్తూ ఉంటారు. అలానే సౌత్ హీరోయిన్స్ బాలీవుడ్ హీరోయిన్స్ తయారవుతారు. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ సమంత.
Rashmika: హాట్ ఫొటోషూట్‌తో సెగలు
ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్‌సిరీస్‌తో సామ్ బాలీవుడ్ యాక్ట్రెస్ లా ఫీల్ అవుతూ తన అందాలు ఆరబోయడం మొదలు పెట్టింది. అలానే ఇప్పుడు రష్మిక మందన కూడా బాలీవుడ్లో ఏ ఫంక్షన్ జరిగిన పొట్టి బట్టలు వేసుకొని ఆమె అందని అందరికి చూపిస్తూ అందరి కళ్లు తనవైపే చూసేలా చేస్తుంది. ‘గుడ్ బాయ్’ మూవీ ప్రమోషన్స్ అయిపోయి సినిమా రిలీజ్ అవగానే ఆమె విజయ్ దేవరకొండతో కలిసి మాల్దీవ్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసింది. మాల్దీవ్స్‌లో ఆమె అందాలు బాగా చూపించేసింది. అక్కడ చేసిన రచ్చ సోషల్ మీడియాలో తగ్గకముందే మళ్ళీ రెడ్ కలర్ డ్రెస్ లో ఆమె గ్లామర్ చూపిస్తూ ఒక మ్యాగజైన్ కోసం చేయించుకున్న ఫొటోషూట్ షేర్ చేసింది.
ఫొటోలు చూస్తే తట్టుకోలేరు
ఆ ఫొటోషూట్‌లో ఆమె తన అందాలను చూపించింది. రెడ్ కలర్ డ్రెస్ లో ఆమె గ్లామర్ తో కెమెరాకి పిచ్చెక్కించే పోజులు ఇచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోస్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ ప్రాజెక్ట్స్ తో బాగా బిజీ అయిన రష్మిక ఏమాత్రం సిగ్గుపడకుండా అందాల అరబోతలో బాగా తెగించిందనే చెప్పాలి.