Rashmika: టాలీవుడ్ లో అనేక మంది హీరోయిన్లు వస్తుంటారు.. పోతుంటారు. ఈ మధ్యకాలంలో టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోయిన్ రష్మిక పేరు బాగా వినిపిస్తోంది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఛలో సినిమాతో రష్మిక పరిచయం అయ్యింది. ఈ హీరోయిన్ బడా హీరోల దగ్గరి నుంచి చిన్న హీరోల వరకు ప్రతి ఒక్కరితోనూ సినిమాలు చేస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ‘మిషన్ మజ్ను’ సినిమాతో కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతోంది. అటు తెలుగు, ఇటు తమిళంలో వరుస సినిమాలు చేసుకుంటూ రష్మిక బాగానే ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. అభిమానులు కూడా చాలా మంది రష్మికకు నేషనల్ క్రష్ అంటూ ట్యాగ్ ఇచ్చేశారు. సోషల్ మీడియాలో కూడా రష్మికకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సాధారణంగా పెద్ద ఇమేజ్ సంపాదించుకున్నాక యాడ్స్ లో నటించడం హీరో, హీరోయిన్స్ చేస్తుంటారు. రష్మిక కూడా కొన్ని యాడ్స్ లో నటిస్తూ వస్తోంది.
Rashmika: ఎడాపెడా యాడ్స్ చేస్తూ చిక్కుల్లో రష్మిక
Samantha: సోషల్ మీడియాలో మళ్ళీ తన పేరు మార్చేసిన సమంత..!
అయితే రీసెంట్ గా రష్మిక ఓ యాడ్ చేసింది. బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె ఆ యాడ్ చేసింది. అయితే ఆ యాడ్‌ను విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎందుకంటే రష్మిక చేసింది ఏ ఫెయిర్ అండ్ లవ్లీయో లేదా సంతూర్ సోప్ యాడో కాదు. అగ్రతార అయ్యుండి ఆమె ఏకంగా అండర్వేర్ యాడ్ లో నటించింది. ఈ యాడ్ కి భారీగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రష్మిక చేసిన ఈ అండర్ వేర్ యాడ్ లో ఒక యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉంటుంది. అందులో విక్కీ యోగా చేస్తూ ఉండగా ఆ టైంలో షర్ట్ పైకి లేచి విక్కీ అండర్వేర్ కనిపిస్తూ ఉంటుంది. అందులో అండర్వేర్ “మ్యాచో” కంపెనీ పేరు ఉంటుంది. ఆ కంపెనీ పేరును గమనించిన రష్మిక ఇంప్రెస్ అయిపోతుంది. అండర్వేర్ వైపు అలాగే చూస్తూ ఉండటం ఆ యాడ్ సారాంశం.
రష్మిక ట్రోలింగ్ పై స్పందన
ఈ యాడ్ ఇప్పుడు విమర్శలపాలయ్యింది. ఇలాంటి దరిద్రపు యాడ్ ను చూడలేమంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. దీనిపై విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఈ యాడ్ లో అమ్మాయిలను తక్కువ చేసి చూపినట్లు నెటిజన్లు ట్రోల్స్ చేయడం విమర్శలకు తావిస్తోంది. చాలా మంది ఇందులో రష్మిక నటించడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. కొద్దిరోజులుగా ఆమెను ఘోరంగా ట్రోల్ చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సదరు ముద్దుగుమ్మ ట్రోలింగ్ పై స్పందించినట్లు తెలిసింది. ఈ ప్రకటనలో నటిస్తే ఇలా అవుతుందని తాను ఊహించలేకపోయానని సన్నిహితుల వద్ద రష్మిక వాపోయిందట.