పంది మాంసం చాలా టేస్టీగా ఉందంటున్న రష్మిక!

సినీ ముద్దుగుమ్మల అందాలను చూస్తే నోరెళ్లబెడుతుంటారు కుర్రకారు. అందులోనూ అందాల భామల సొగసు చూసి రెప్పవాల్చడం కూడా మర్చిపోయేలా చేస్తారు. ఇంకా ఈ ముద్దుగుమ్మల అందమైన శరీరా కృతి చూసి ఆడవారంటే ఇలా ఉండాలి అని చాలా మంది అనుకుంటుంటారు. ఎట్లాగైనా సరే ఈ ముద్దుగుమ్మ ఏమేమి తింటుందో తెలుసుకుని తీరి నేను కూడా అలాగే కావాలని చాలా మంది యువతులు ప్రయత్నిస్తుంటారు. తన అందచందాలతో కుర్రకారు హఈదయాలను దోచుకున్న భామ రష్మిక మందాన. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ చేపకళ్ల సుందరి ఎంతో మంది కుర్రకారు మనస్సును కొల్లగొట్టింది.

తన అందంచందాలతో, అద్బుతమైన నటనతో, జీరో సైజ్ తో, సన్నజాజి లాంటి నడుముతో కుర్రకారు మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఛలో సినిమాతో మంచి హిట్ ను కొట్టేసిన ఈ భామ ఎన్నో మంచి మంచి ఆఫర్లను అందిపుచ్చుకుంటుంది. మరి ఈ ముద్దుగుమ్మ ఒక వెబ్ సైట్ లో తన గురించి చెప్పిన కొన్ని విషయాలు ఆసక్తికరంగా మారాయి. మరి అవేంటో తెలుసుకోండి.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వైఫ్ ఉపాసన చేస్తున్న సామాజిక కార్యక్రమాల గురించి అందరికీ తెలిసిందే. అదే నండి ఆరోగ్యంపై ప్రజలకు అవగాహన కల్పించేదుకు రీసెంట్ గా యుఆర్ లైఫ్ అనే వెబ్ సైట్ ను ఉపాసన ప్రారంభించిన విషయం తెలిసిందే.

అయిత ఈ వెబ్ సైట్ కు ఉపాసన మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. దీని ద్వారా ఉపాసన అందమైన సుందరీలను తీసుకొచ్చి వారిచేత ప్రత్యేకమైన వంటలను వండిస్తూ ఉంటుంది. అయితే ఉపాసన రీసెంట్ రీచార్డ్ యువ్ లైఫ్ విత్ రష్మిక అనే పేరుతో రష్మిక మందానతో వంటలు వండించింది. దీనిలో రష్మిక ‘కోలీ పుట్టు’ అనే వంటను చేసింది. దీనికి ఉపాసన ఎంతో ఇంప్రెస్ అయిందనే చెప్పుకోవచ్చు. అయితే కోలీ పేరును విన్న ఉపాసన రష్మికను మీరు కోవడ(కోర్గి) అనే సామాజిక వర్గానికి చెందిన వారా అని అడిగారు. అందుకు కారణం లేకపోలేదు.

ఎందుకంటే కోడిని కోర్గిలో కోలి అంటారట. అందుకే మీరు కోర్గి వర్గానికి చెందిన వారా? అయితే మీరు పంది మాంసాన్ని కూడా తింటారు కదూ అని అడిగారు. దానికి రష్మిక.. అవును మేము పందిమాసాన్ని తింటాము. అలాగే మా ఇంట్లోనే వైన్ కూడా తయారుచేసుకుంటాము. ముఖ్యంగా పంది మాంసాన్ని కాల్చుకుని తింటే బలే టేస్టీగా ఉంటుందని రష్మిక తెలిపింది. అలాగే పంది మాంసం, వైన్ లతో పాటుగా ఇంకా చాలా రకాల వంటలు కూడా మేము చేసుకుంటామని రష్మిక మందాన వెళ్లడించింది. అలాగే రాత్రి పూట నిద్ర పోయే టైంలో రెండు కప్పుల వైన్ తాగితే నిద్ర హాయిగా పడుతుందని రష్మిక చెప్పింది. అయితే ఈ ముద్దుగుమ్మ సొంతూరు కర్ణాటకలోకిని కొడుగు జిల్లలోని విరాజ్ పేట్ పట్టణంగా తెలిపింది.