Rasikhanna: మద్రాస్ కేఫ్ సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది బబ్లీ బ్యూటీ రాశిఖన్నా. ఈ సినిమాతో మంచి పేరు రావడంతో తెలుగులో నాగ శౌర్య హీరోగా అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్తో అందరినీ బాగా ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే తెలుగులో యంగ్ హీరోలకు మంచి ఛాయిస్ అని మాట్లాడుకున్నారు. ఆ విధంగానే రాశిఖన్నాను తెలుగులో వరుసగా సినిమా అవకాశాలు దక్కాయి. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన జోరు సినిమాలో గ్లామర్ రోల్ చేసి యూత్ ఆడియన్స్‌ను మెస్మరైజ్ చేసింది.
అంతేకాదు ఈ సినిమాలో రాశిఖన్నా టైటిల్ సాంగ్ కూడా పాడి అందరి ప్రశంసలు అందుకుంది. ఒకవైపు హీరోయిన్గా మరొకవైపు సింగర్‌గా టాలీవుడ్లో మంచి పాపులారిటీ తెచ్చుకున్న రాశిఖన్నా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన సుప్రీం సినిమాలో బెల్లం శ్రీదేవిగా నటించి ఆకట్టుకుంది. ఇలా ఆమె ఏ సినిమాలో నటించిన మంచి హిట్ సాధిస్తుండటంతో యంగ్ హీరోయిన్స్‌కు గట్టిగానే పోటీ ఇస్తూ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారింది. జిల్, శివం, బెంగాల్ టైగర్ లాంటి సినిమాలు ఆమెకు వరుస హిట్స్ వచ్చి తెలుగులో చాలా బిజీ హీరోయిన్ అయింది.
Rasikhanna: రాశి ఈ టిక్ టాక్ డైలాగ్‌తోనే పాపులర్ అయింది.
ముఖ్యంగా జిల్, బెంగాల్ టైగర్ సినిమాలతో కేవలం యంగ్ హీరోల సరసన మాత్రమే కాదు సీనియర్ హీరోల సరసన కూడా సూటయ్యే హీరోయిన్ అని నిరూపించుకుంది. కెరీర్ ప్రారంభం నుంచి రాశిఖన్నాకు మంచి హిట్ సినిమాలే పడ్దాయి. అదే ఆమె ఇంకా విభిన్నమైన సినిమాలు చేసేందుకు ఆస్కారం లభించింది. ఆ మధ్య వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమాలో మరోసారి సాయి ధరం తేజ్ సరసన నటించింది. ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహించాడు. ఇందులో ఆమె టిక్ టాక్ చేసే అమ్మాయిగా మంచి ఫన్ రోల్ చేసింది. ఈ రోల్ రాశికి బాగా పేరు తెచ్చిపెట్టింది.
అంతేకాదు ఇందులో ‘నాక్ నాక్ నాక్ నాక్ నాకొద్దు’ అనే టిక్ టాక్ పేరడితో బాగా ఆకట్టుకుంది. ప్రతిరోజూ పండుగ సినిమా రిలీజ్‌కు ముందు విడుదల చేసిన ట్రైలర్‌తో రాశి ఈ టిక్ టాక్ డైలాగ్‌తోనే పాపులర్ అయింది. సినిమా రిలీజయ్యాక కూడా అది బాగా వైరల్ అయింది. ఇప్పుడు కూడా రాశిఖన్నా చెప్పిన ఓ డైలాగ్ బాగా వైరల్ అవుతోంది. మరోసారి మారుతి దర్శకత్వంలో రాశిఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. మాచో హీరో గోపీచంద్ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రాశి లాయర్ పాత్రలో కనిపిస్తోంది. పక్కా కమర్షియల్ అనే టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Rasikhanna: రిలీజయ్యాక ఇదే డైలాగ్ ఏ రేంజ్లో క్లిక్ అవుతుందో చూడాలి.
అయితే తాజాగా ఈ సినిమా నుంచి థియేట్రికల్ ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ చూస్తుంటే మారుతి మార్క్ ఎంటర్టైన్మెంట్, గోపీచంద్ మార్క్ యాక్షన్ పుష్కలంగా ఉన్నట్టు అర్థమవుతోంది. ఇక రాశిఖన్నా ఇందులో “ఇక్కడ ఈ ఎక్స్ ప్రెషన్ పెట్టకూడదు.. ఇలా పెట్టాలి” అని చెప్పిన డైలాగ్ విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కొందరు నెటిజన్స్ ఈ డైలాగ్‌తో ఫన్నీగానూ ఆమెను కామెంట్ అండ్ ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి మారుతి రాసిన డైలాగ్, రాశి చెప్పిన స్టైల్ బాగా వర్కౌట్ అయింది. ఇక పక్కా కమర్షియల్ రిలీజయ్యాక ఇదే డైలాగ్ ఏ రేంజ్లో క్లిక్ అవుతుందో చూడాలి.