RATION CARD : భారతదేశంలోని పేదల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. వీటిలో ఒకటైన జాతీయ ఆహార భద్రత పథకం నుంచి లబ్ధి పొందేందుకు ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డు ఉండాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికీ కొందరికి రేషన్ కార్డు లేక చౌక ధరలకే అందించే నిత్యావసర సరుకులను పొందలేకపోతున్నారు. అలాంటి వారిలో మీరు కూడా ఒకరైతే రేషన్ కార్డు పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Big Breaking: కేసీఆర్ కి టీడీపీ ఎమ్మెల్యేల లేఖ.. జగన్ పై ఘాటు విమర్శలు..!!
కొత్తగా రేషన్ కార్డు కావాలనుకునేవారు.. లేదా కార్డుని రెన్యూవల్ చేయించాలి అనుకునేవారు.. కొత్త సభ్యుడి పేరు చేర్చాలనుకునే వారందరూ ప్రస్తుతం సుమారు పది రకాల పత్రాలు సమర్పించుకోవాలి ఉంటుంది. ఆహార భద్రతా రేషన్ కార్డు జారీ చేసే సాఫ్ట్వేర్ను కేంద్ర ప్రభుత్వం నియంత్రిస్తుంటుంది. కనీసం పది పత్రాలు సమర్పిస్తేనే ఈ సాఫ్ట్వేర్ రేషన్ కార్డు జారీ చేసే ప్రక్రియను ముందుకు తీసుకు వెళుతుంది.
Periods: మాత్రలు లేకుండా నెలసరి ఆలస్యంగా రావడానికి ఈ సింపుల్ చిట్కా చాలు..
అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటో తెలుసుకుంటే..
1. మీ కుటుంబంలోని పెద్దవారి పాస్పోర్ట్ సైజు ఫొటో
2. ఒకవేళ గతంలో మీ రేషన్ కార్డు రద్దయి ఉంటే.. రేషన్ కార్డ్ రద్దు సర్టిఫికెట్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
3. పెద్దవారి బ్యాంక్ ఖాతా, మొదటి, చివరి పేజీ ఫొటోకాపీ
4. గ్యాస్ పాస్ బుక్ ఫొటోకాపీ
5. మీ కుటుంబ సభ్యులలోని అందరి ఆధార్ కార్డుల ఫొటోకాపీ
6. దరఖాస్తుదారుడి బర్త్ సర్టిఫికెట్ / హైస్కూల్ సర్టిఫికేట్/ఓటర్ ఐడి కార్డ్ లేదా పాన్ కార్డ్ ఫొటోకాపీ
7. క్యాస్ట్ సర్టిఫికెట్ డాక్యుమెంట్(SC, ST, OBC) ఫొటోకాపీ(మీకు వర్తిస్తే)
8. దివ్యాంగుల కోసం వైకల్యం సర్టిఫికేట్ ఫొటోకాపీ జతచేయాలి.
9. మీరు MNREGA జాబ్ కార్డ్ హోల్డర్ అయినట్లయితే.. జాబ్ కార్డ్ ఫొటోకాపీ
10. ఇన్కమ్ సర్టిఫికెట్ ఫొటోకాపీ
11. అడ్రస్ ప్రూఫ్ నిమిత్తం విద్యుత్ బిల్లు, నీటి బిల్లు, ఇంటి పన్ను, ఏదైనా ఒకదాని ఫొటోకాపీ.
12. రేషన్ కార్డు మంజూరు అయిన తర్వాత ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.