Bigg Boss 5 Telugu: మరోసారి కెమెరాలో అడ్డంగా దొరికేసిన రవి..??

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పోటీ చేస్తున్న వారిలో ప్రేక్షకులకు బాగా తెలిసిన ముఖం యాంకర్ రవి. హౌస్ లో రాకముందే బుల్లితెరపై అనేక షో లకి హోస్ట్ గా… యాంకరింగ్ చేస్తూ తన పంచ్ డైలాగులతో టెలివిజన్ ప్రేక్షకులను అలరించిన రవి.. పలు ప్రఖ్యాత అవార్డు ఫంక్షన్ లకి, సినిమా ఫంక్షన్ లకి కూడా యాంకరింగ్ చేయడం జరిగింది. ఇటువంటి క్రేజ్ కలిగిన రవి హౌస్ లో అడుగుపెట్టడంతో.. చాలా వరకు కెమెరా స్పేస్ దొరికింది. ఈ తరుణంలో మనోడు మరింతగా రెచ్చిపోయాడు. ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది.. అన్న తరహాలో ఎదుటివారిని ప్రభావితం చేస్తూ వారికి తెలియకుండా వారితో మాట్లాడుతున్నే… ఆడియన్స్ వ్యూ లో… నెగిటివిటీ క్రియేట్ చేస్తూ గేమ్ ఆడుతూ ఉన్నాడు. ఈ తరహా గేమ్ ప్రియా- లహరి ల మధ్య.. ఆడగా .. రవిని కెమెరాలు  అడ్డంగా బుక్ చేశాయి.

Bigg Boss Telugu 5 Promo: RJ Kajal Worst Performer Of This Week - Sakshi

ఇక అదే సమయంలో నటరాజ్ మాస్టర్ రవి కి పెట్టిన గుంటనక్క పేరు… కరెక్ట్ గా సూట్ అయింది అని.. బయట జనాలు ప్రియా లహరి గొడవ టైం సోషల్ మీడియాలో డైలాగులు వేశారు. ఈ రకంగా గేమ్ ఆడుతున్న రవి ప్రస్తుతం హౌస్ లో “రాజ్యానికి ఒక్కడే రాజు టాస్క్” లో… రాజు గా గెలవడం తెలిసిందే. దీంతో మనోడు ఇప్పుడు హౌస్ లో వేరే లెవెల్ గేమ్ ప్లాన్ చేస్తున్నాడు అని బయట జనాలు అంటున్నారు. విషయంలోకి వెళ్తే లోబో, కొత్త కెప్టెన్ ప్రియాతో కలిపి తనకి వ్యతిరేకంగా ఉండే కంటెస్టెంట్ లను రవి గట్టిగా టార్గెట్ చేయడం జరిగిందని అంచనా వేస్తున్నారు. ఈ ప్లాన్ లో భాగంగానే వరస్ట్ పర్ఫార్మర్ టాస్క్ ప్రారంభం కాకముందు కాజల్ గురించి తన గ్రూపు దగ్గర డిస్కషన్ పెట్టారని.. జనాలు చెప్పుకొస్తున్నారు.

 

Bigg Boss 5 Telugu: లహరి విషయంలో యాంకర్ రవిని ఏకిపారేస్తున్న నెటిజన్స్..  వీడియోతో అసలు విషయం బట్టబయలు.. | Bigg boss 5 telugu netizens fires on  anchor ravi about lahari and priya ...

రవి తన సేఫ్ సైడ్ కోసం గేమ్ ఆడుతున్నే

ఇందువల్లే వరెస్ట్ పర్ఫార్మర్ టాస్క్ లో…లోబో తన వంతు వచ్చే టైంకి.. కాజల్ ని సెలెక్ట్ చేసుకుని రవి కి వెన్నుపోటు పొడిచిన కారణంగా ఆమెను విమర్శించడం జరిగిందని, అదే రీతిలో కెప్టెన్ గా ప్రియా కొత్త అవతారం ఎత్తిన గాని ఆమె చాలా వరకు నిర్ణయాలు రవి దగ్గర డిస్కషన్ చేస్తున్నారని ఆడియన్స్ శుక్రవారం జరిగిన ఎపిసోడ్ తర్వాత సోషల్ మీడియా లో చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనా హౌస్ లో రవి తన సేఫ్ సైడ్ కోసం గేమ్ ఆడుతున్నే మరోపక్క ప్రత్యర్థులను..లోబో, కెప్టెన్ ప్రియా ద్వారా గట్టిగా టార్గెట్ చేస్తున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే గేమ్ పరంగా కంటెస్టెంట్ లను మాత్రమే పోక చేస్తున్న రవి.. కెమెరా లో అడ్డంగా బుక్ కావడం విశేషం.

నువ్వు బయట యాంకర్ కావచ్చు, ఇక్కడ కాదు, రవికి మానస్ వార్నింగ్! | bigg boss  season 5 actor manas warning to anchor ravi this is why

లహరి క్యారెక్టర్ దెబ్బతీసేలా ప్రియా దగ్గర

కాజల్ విషయాన్ని తన గ్రూపు సభ్యుల మధ్య డిస్కషన్ పెట్టడం.. ఆ తర్వాత వేరేలా ఆమె ముందే మాట్లాడటం.. అంత కెమెరాలో కనబడటంతో రవి లో ఉన్న యాంగిల్స్ మాట్లాడే తీరు విషయంలో ఆడియన్స్ షాక్ అయి పోతున్నారు. ప్రియా..లహరి హగ్ గొడవలో కూడా ఇదే తేలింది. ప్రియా దగ్గర ఒకలాగా లహరి దగ్గర ఒకలాగా మాట్లాడిన రవి.. లహరి క్యారెక్టర్ దెబ్బతీసేలా ప్రియా దగ్గర కామెంట్లు చేశాడు. అదే విషయం బయటపడటంతో.. రవి బండారం మొత్తం తెలియటంతో అప్పటికే.. ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ కావటంతో నామినేషన్ లో ఉన్న లహరి బలైపోయింది. ఇప్పుడు ఇదే తరహాలో.. రవి తనకి బదులు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ లోబో, ప్రియా శ్రీ రామ్ చంద్ర.. మరి కొంతమందిని తన ప్రత్యర్థులపై రవి ఉసి కోల్పోతు.. కెమెరాల ముందు అడ్డంగా బుక్క అయిపోతున్నాడు.  


Share

Related posts

మే 17 వరకు లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం

Siva Prasad

స్పీడు పెంచిన కేటీఆర్

Siva Prasad

Eyebrows: ఒత్తైన కనుబొమ్మలు కోసం.. ఈ సింపుల్ చిట్కాలు చాలు..!!

bharani jella