Bigg Boss 5 Telugu: యాంకర్ రవి ని గుంటనక్క అనే టైటిల్ వెంటాడుతూనే ఉంది. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ రెండవ వారం ఎలిమినేషన్ కి సంబంధించి నామినేషన్ ప్రక్రియ సమయములో నటరాజ్ మాస్టర్… పరోక్షంగా రవి ని ఉద్దేశించి గుంటనక్క అని డైలాగ్ వేయడం తెలిసిందే. ఈ తరుణంలో రవి ఎవరిని ఉద్దేశించి ఈ డైలాగ్ వేశారని… నటరాజ్ మాస్టర్ ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అంతవరకు ఆయన్ని వేధించాడు. చివరకు రవికె ఇన్ డైరెక్ట్ గా … తనని ఉద్దేశించి గుంటనక్క అనే టైటిల్ పెట్టినట్లు క్లారిటీ ఇచ్చాడు.
అంతమాత్రమే కాకుండా ఇంటి నుండి గత వారం ఎలిమినేట్ అయిన టైంలో కూడా.. నాగార్జున గుంటనక్క ప్రస్తావన తీసుకువచ్చారు. దీంతో యాంకర్ రవికి సంబంధించి గుంట నక్క టైటిల్… సోషల్ మీడియా లో బిగ్ బాస్ హౌస్ లో బాగా వైరల్ అవుతుంది. ఇదిలా ఉంటే శనివారం జరిగిన ఎపిసోడ్ లో.. కూడా మరోసారి నాగార్జున… తెలివితేటలు ఎక్కువగా ఉండే యానిమల్.. అంటూ గుంటనక్క పేరును పరోక్షంగా… ప్రస్తావిస్తూ రవి ని ఉద్దేశించి డైలాగ్ వేయడం జరిగింది.
నటరాజ్ మాస్టర్ ఎక్కడున్నాడో
దీంతో రవి తెగ బాధపడిపోయారు. నటరాజ్ మాస్టర్ ఎక్కడున్నాడో… అనవసరంగా తనకి ఈ టైటిల్ పెట్టినట్లు… మదన పడిపోయాడు. మరోపక్క బయట జనాలు.. రవి కి కరెక్ట్ గా సూట్ అయ్యే టైటిల్ నటరాజ్ మాస్టర్ పెట్టాడని మరోసారి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఈ గుంట నక్క అనే టైటిల్… యాంకర్ రవి కెరీర్ మొత్తం వెంటాడుతూనే ఉంటుంది అని… ఎందుకంటే హౌస్ లో ఒకరి దగ్గర మాటలు మరొకరి దగ్గర మాట్లాడటంతో పాటు.. ఎదుటి వ్యక్తిని నెగిటివిటీ రూపంలో తన డిస్కషన్ తో… రవి క్రియేట్ చేయటం.. కెమెరాల ముందు అడ్డంగా బుక్ కావడం.. అతనికి మైనస్ అని గుంటనక్క మాదిరిగానే.. అతని ఆట తీరు ఉందని చెప్పుకొస్తున్నారు.