న్యూస్ సినిమా

రవితేజ ‘క్రాక్’.. ఫుల్ ఎంజాయ్ చేశాను అంటున్న మెగా హీరో..!!

Share

లాక్‌డౌన్‌ దెబ్బకు సినిమా వ్యాపారం మట్టానికి దిగి పోయినట్లే అనే వార్తలు మొన్నటి దాకా వచ్చాయి. కానీ ప్రభుత్వాలు రాయితీలు ఇస్తూ సినిమా వాళ్లను ఆదుకునే విధంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉన్న తరుణంలో.. ఇటీవల ఓపెన్ అయిన సినిమా ధియేటర్ లలో రిలీజ్ అవుతున్న సినిమాలకు సినిమా యూనిట్ మాత్రమేకాక ఇండస్ట్రీలో ఉన్న బడా హీరోలు సైతం ప్రచారం కల్పించే రీతిలో, బేషజాలు పక్కనబెట్టి సినిమా వ్యాపారాన్ని కాపాడుకునే విధంగా వ్యవహరిస్తూ ఉండటం విశేషం.

Ram Charan confirms release date for his upcoming film RRR | Telugu Movie  News - Times of Indiaఈ క్రమంలో ముందుగా మెగా హీరో రామ్ చరణ్ సంక్రాంతి పండుగ సందర్భంగా రవితేజ నటించిన ‘క్రాక్’ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసినట్లు ట్విట్టర్ ద్వారా తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన రవితేజ ‘క్రాక్’.. మొదటి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. దీంతో సంక్రాంతి పండుగ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలలో అదరగొట్టే కలెక్షన్లు కొల్లగొడుతోంది.

 

ఒక పక్క వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో ప్రజలలో పెద్దగా భయాందోళన లేకపోవడంతో.. థియేటర్లలో రిలీజ్ అవుతున్న సినిమాలకూ జనాలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నా అభిమాన నటుడు రవితేజ నటించిన క్రాక్ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేసినట్లు తెలిపారు. అంత మాత్రమే కాక రవితేజ టాప్ ఫామ్ లో ఉన్నారని.. హీరోయిన్‌ శ్రుతి హాసన్‌ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారని, సముద్రఖని, వరలక్ష్మీశరత్‌ కుమార్‌ తమ నటనతో అదరగొట్టారని, థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని, డైరెక్టర్ గోపిచంద్ ఈ మూవీని తెరకెక్కించిన విధానం అద్భుతం అని ఈ సినిమా టీం మొత్తానికి శుభాకాంక్షలు తెలుపుతున్నానని రామ్‌చరణ్ ట్వీట్ చేశాడు. ఈ క్రమంలో చరణ్ చేసిన ట్వీట్ కి మూవీ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మరియు సినిమా సంగీత దర్శకుడు తమన్ ధన్యవాదాలు తెలిపారు.


Share

Related posts

Karthika Deepam Jan 18 today’s episode: సాందర్యను వెతుకుంటూ ప్రకృతి ఆశ్రమానికి వెళ్లిన దీపను సౌందర్య చూస్తుందా..?

Ram

చర్మం కాంతివంతంగా మెరవడానికి కల్తీ లేని ఈ పానీయం తీసుకోవడం ఒక్కటే మార్గం!!

Kumar

Anupama Parameswaran: మేక‌ప్ లేకుండా ద‌ర్శ‌న‌మిచ్చిన అనుప‌మ‌.. వామ్మో ఇలా ఉందేంటి?

kavya N
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar