Ravi teja : రవితేజ ఖిలాడి సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘రాక్షసుడు’ సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెకుతున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తుండగా..ఈ సినిమాని డా. జయంతీలాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు ఏ స్టూడియోస్‌తో కలిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ‘క్రాక్’ సినిమాతో మూడేళ్ళకి బ్లాక్‌బస్టర్ అందుకున్న మాస్ మహారాజ ఖిలాడి సినిమాతో మరో సూపర్ హిట్ అందుకోవడానికి ప్లాన్ చేస్తున్నాడు.
కాగా రవితేజ సరసన మీనాక్షి చౌదరి డింపుల్ హయతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనసూయ కీలక పాత్రలో కనిపించబోతోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందిస్తున్నాడు. ‘ప్లే స్మార్ట్’ అన్న ట్యాగ్‌లైన్ తో హవీష్ ప్రొడక్షన్ సారథ్యంలో రూపొందుతోంది. ఇక ‘ఖిలాడి’ని ప్రపంచవ్యాప్తంగా మే 28న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. బాలయ్య తో పోటీ పడబోతున్న రవితేజ భారీ హిట్ అందుకుంటానన్న ధీమాతో ఉన్నాడట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. అక్కడ రవితేజ సహా ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
Ravi teja : బడ్జెట్ లో ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్స్ కే ఖర్చు చేస్తున్నారట.
ఇక ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన వీడియో గ్లింప్స్, పోస్టర్లు ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేశాయి. బడ్జెట్ లో ఎక్కువ భాగం యాక్షన్ సీక్వెన్స్ కే ఖర్చు చేస్తున్నారట. క్రాక్ సినిమా ని మించి ఖిలాడి లో యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత పెద్ద గ్యాప్ లేకుండా నక్కిన త్రినాథ రావు దర్శకత్వంలో రవితేజ ఒక సినిమా చేయబోతున్నాడు. కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుండగా జాతిరత్నం ఫేం ఫరియా అబ్దుల్లాని హీరోయిన్ గా పరిశీలిస్తున్నారట.