వైరల్ అవుతున్న రవితేజ జిమ్ వీడియో…

వరుస ఫ్లాపులు వచ్చినా కూడా రవితేజ ఏ మాత్రం నిరాశ పడడంలేదు.  ఒకటి తరువాత మొరొకటి సినిమాలు చేస్తూనే ఉన్నాడు. రవి తేజ కాంఫిడెన్స్ చూసి హీరోలు, దర్శకులు అంతా ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు. ఏడాదికి ఒక్క సినిమా అయినా రిలీజ్ అవుతూనే ఉంది.

వైరల్ అవుతున్న రవితేజ జిమ్ వీడియో...

ప్రస్తుతం రవి తేజ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరక్కిన  క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరిదశకు చేరుకుంది. తమిళ భాషలో సూపర్ హిట్ అందుకున్న సేతుపతి సినిమా ఆధారంగా ఈ చిత్రం రూపొందింపబడుతుంది. రవి తేజకు సరిపోయేలా మాస్ ఇమేజ్‌ వచ్చేలా దర్శకుడు గోపీచంద్ కథలో చిన్న చిన్న మార్పులు చేసాడు. 

తాజాగా రవి తేజ తన ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేసిన వర్కౌట్స్ వీడియో ఇపుడు వైరల్ అవుతుంది. ఆ వీడియో లో రవి తేజని చూసి ఫాన్స్ ఖుషి అయిపోయారు. క్రాక్ సినిమా కోసం రవితేజ ఫాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.