Ravi Teja: ఆ సినిమా ఔట్‌పుట్‌పై రవితేజ తీవ్ర నిరాశ.. ప్రమోషన్లకు రానని!

Share

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై 29న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ మూవీ రిలీజ్‌కు ఇంకా నెల రోజుల లోపే సమయం మిగిలి ఉన్నందున, ఈ చిత్ర నిర్మాతలు భారీ ప్రీ-రిలీజ్ ప్రమోషనల్ ఈవెంట్‌లకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రవితేజ తాను ఈ మూవీ ప్రమోషన్లకు రానంటే రాను అని మూవీ యూనిట్‌కి తేల్చి చెప్పాడట.

Ravi Teja: ఔట్‌పుట్‌పై తీవ్ర నిరాశ

తాజాగా రవితేజ ఎడిటింగ్ రూమ్‌లో రామారావు ఆన్ డ్యూటీ సినిమాను చూశాడు. అయితే మూవీ ఔట్‌పుట్‌ అసలు నచ్చకలేదట. అందుకే ఈ సినిమాకి ప్రమోషన్లు చేసినా.. చేయకపోయినా అట్టర్ ఫ్లాప్ అవుతుందనే ఓ నిర్ణయానికి వచ్చాడట. ఆ కారణంగానే ఏ ప్రమోషనల్ ఈవెంట్‌కి రాకూడదని రవితేజ యోచిస్తున్నట్లు సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, మేకర్స్ తమ ప్రమోషన్లను హీరో లేకుండా ఎలా ప్లాన్ చేస్తారో చూడాలి.

ఎమ్మార్వోగా మాస్ మహారాజా

నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో పేదరికంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు సహాయం అందిస్తూ అవినీతిని నిర్మూలించే పని చేపడతాడు రవితేజ. నిజాయితీగల ఎమ్మార్వో ఆఫీసర్ గా అలరించనున్నాడని ఇప్పటికే మూవీ యూనిట్ తెలిపింది. ఇందులో దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ అనే హీరోయిన్స్ గా నటించారు. ఈ మూవీలో వేణు తొట్టెంపూడి కీలక పాత్రలో నటించాడు. నాజర్, సీనియర్ నరేష్, పవిత్రా లోకేష్ ఇతర సహాయక పాత్రల్లో నటించారు. దీనిని SLV సినిమాస్, LLP, RT టీమ్‌వర్క్స్ క్రింద సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.


Share

Recent Posts

పాపం.. అఖిల్‌ ఆ క‌ష్టం నుండి ఎప్పుడు బ‌య‌ట‌ప‌డ‌తాడో?

నాగార్జున వార‌సుడిగా సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ అక్కినేని.. కెరీర్ స్టార్టింగ్‌లో వ‌రుస ఫ్లాపుల‌ను మూడ‌గ‌ట్టుకున్నాడు. ఈయ‌న నుండి వ‌చ్చిన `అఖిల్`, `హలో`, `మిస్టర్ మజ్ను` చిత్రాలు…

7 mins ago

తిన‌డానికి తిండి కూడా ఉండేదికాదు.. చాలా క‌ష్ట‌ప‌డ్డాం: నిఖిల్‌

విభిన్న‌మైన క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తూ టాలీవుడ్‌లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వ‌ర‌లోనే `కార్తికేయ 2`తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.…

1 hour ago

బీహార్ సీఎంగా 8వ సారి నితీష్ కుమార్ …ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్

బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…

1 hour ago

స‌మ్మె ఎఫెక్ట్‌.. ప్ర‌భాస్‌కు అన్ని కోట్లు న‌ష్టం వ‌చ్చిందా?

గ‌త కొద్ది నెల‌ల నుండి సినిమాల ద్వారా వ‌చ్చే ఆదాయం బాగా త‌గ్గిపోవ‌డం, నిర్మాణ వ్య‌యం మోయ‌లేని భారంగా మార‌డంతో.. తెలుగు సినీ నిర్మాతలు త‌మ స‌మ‌స్య‌ల‌ను…

2 hours ago

బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చిన బీహార్ సీఎం నితీష్ కుమార్ .. సీఎం పదవికి రాజీనామా

జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…

3 hours ago

ర‌ష్మిక నో చెప్పాక కృతి శెట్టి న‌టించిన‌ సినిమా ఏదో తెలుసా?

యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. త‌క్కువ స‌మ‌యంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ‌.. త్వ‌ర‌లోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్ష‌కుల‌ను…

3 hours ago