రవితేజ క్రాక్ సక్సస్ ఎంజాయ్ చేస్తూనే ఖిలాడి సెట్స్ లో అడుగు పెట్టాడు ..!

రవితేజ క్రాక్ సినిమాతో చాలాకాలం తర్వాత భారీ కమర్షియల్ సక్సస్ ని అందుకున్నాడు. బాక్సాఫీస్ వద్ద ఈ సంక్రాంతికి 4 సినిమాలతో పోటీ పడి విన్నర్ గా నిలిచాడని చెప్పుకుంటున్నారు. దాదాపు 3 ఏళ్ళ తర్వాత raviteja కి krack సినిమాతో కావాల్సిన.. రావాల్సిన సాలీడ్ హిట్ రావడం తో ఫుల్ సక్సస్ మూడ్ లో ఉన్నాడు. ఠాగూర్ మధు నిర్మాతగా యాక్షన్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన krack అందరి ఫేట్ ని మార్చేసింది. అటు శృతి హాసన్.. ఇటు దర్శకుడు gopichand malineni కూడా క్రా సినిమాతో మళ్ళీ సక్సస్ ట్రాక్ లోకి వచ్చేశారు.

కాగా మన మాస్ మహారాజా raviteja క్రాక్ సినిమా సక్సస్ ని ఎంజాయ్ చేస్తూనే కొత్త చిత్రం khiladi సెట్ లో అడుగు పెట్టాడు. krack ఇచ్చిన కిక్ తో డబుల్ ఎనర్జీతో ఖిలాడి సినిమాని కంప్లీట్ చేయబోతున్నాడు. నాన్ స్టాప్ గా సినిమాని కంప్లీట్ చేసి సమ్మర్ వరకు ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నాడు. 2021 ప్రారంభంలోనే క్రాక్ తో సూపర్ హిట్ అందుకున్న raviteja ఖిలాడీ తో కూడా మరో హిట్ అందుకోవాలని కసితో ఉన్నాడు. అంతేకాదు khiladi సినిమా తో పాటు మరో సినిమాని ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేలా సన్నాహాలు చేసుకుంటున్నాడు.

ప్రస్తుతం raviteja ఖిలాడి సినిమా శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక రవితేజ కెరీర్‌లో 67వ సినిమాగా తెరకెక్కుతున్న khiladi లో మీనాక్షి చౌదరి .. డింపుల్ హయాతి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కాగా ఈ నెల 26 వ తేదీన రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఖిలాడి సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.