Ram charan : రాం చరణ్ డ్రైవింగ్ లైసెన్స్ సినిమాని నిర్మించబోతున్నాడా..ఈ సినిమా లో రవితేజ – విజయ్ సేతుపతి.. హీరోలుగా నటించబోతున్నారా.. అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. రాం చరణ్ హీరోగా నటిస్తూనే కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో సినిమాలను నిర్మిస్తున్నాడు. మెగాస్టార్ కోసమే ఈ నిర్మాణ సంస్థని స్థాపించినప్పటికి అన్ని ప్రాజెక్ట్స్ ని నిర్మించాలని డిసైడయ్యాడు. అంతేకాదు తన సొంత బ్యానర్ లో బయట నిర్మాతలతోను కలిసి సినిమాలు నిర్మాణం జరుపుతున్నాడు.
ఇక కథ బావుండి వేరే భాషలో సూపర్ హిట్ అయితే వెంటనే ఆ సినిమాని తెలుగులో నిర్మిచేందుకు రైట్స్ కొంటున్నాడు. అలా కొన్న సినిమాలని తండ్రి చిరంజీవితో అలాగే బయట హీరోలతో చేస్తున్నాడు. 2019 లో మలయాళ సినిమా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చి సూపర్ హిట్ గా నిలిచింది. ఒరిజినల్ వెర్షన్లో పృథ్విరాజ్ సుకుమారన్, సూరజ్ వెంజరమూడు హీరోలుగా నటించగా ప్రేక్షకుల్ను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా రీమేక్ రైట్స్ ని చరణ్ దక్కించుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాలో బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలనుకున్నట్టు వార్తలు వచ్చాయి.
Ram charan : చరణ్ నిర్మాణంలో డ్రైవింగ్ లైసెన్స్..?
అయితే పవన్ కళ్యాణ్ వరసగా సినిమాలు కమిటయిన సంగతి తెలిసిందే. రాం చరణ్ కూడా ఆర్ ఆర్ ఆర్ అన్న పాన్ ఇండియన్ సినిమాతో పాటు ఆచార్య సినిమా చేస్తున్నాడు. అలాగే శంకర్ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియన్ సినిమా కూడా చేయబోతున్నాడు. ఈ క్రమంలో ఇప్పుడు చరణ్ నిర్మాణంలో డ్రైవింగ్ లైసెన్స్ రవితేజ – విజయ్ సేతుపతిలతో చేయబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలీదు గాని ఇప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు మొదలయ్యాయి.