Ravibabu:ఒక డైరెక్టర్ గా, రైటర్ గా, నిర్మాతగా టాలీవుడ్ లో తనదైన శైలిలో దూసుకుపోయి సినీ కెరీర్ లో సక్సెస్ఫుల్ మ్యాన్ గా పేరుతెచ్చుకున్నారు రవిబాబు. ఇప్పటికే రవిబాబు ఎన్నో విభిన్న పాత్రలలో నటించి ప్రేక్షకుల మన్నన లను పొందారు. రవిబాబు ఇప్పటివరకు 70 పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. తాజాగా రవిబాబు క్రష్ అనే సినిమాకి దర్శకత్వం వహించారు. ఈసినిమా ఫిబ్రవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ తరుణంలో రవిబాబు ఒక ప్రముఖ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ అందులో తన సినీ ప్రయాణం గురించి చెప్పుకొచ్చారు.

ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా ఆయన హీరోయిన్ భూమిక గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. ‘ఇప్పటి వరకు నా కెరీర్ లో నేను బాధపడిన సందర్భాలు పెద్దగా ఏమి లేవు కానీ భూమిక నటించిన అనసూయ సినిమా షూటింగ్ అప్పుడు మాత్రం భూమిక కారణంగా నేను చాలా ఇబ్బంది పడ్డాను’ అని అన్నారు రవిబాబు.
ఇది విన్న ఆ ఛానల్ ఇంటర్వ్యూయర్ షాక్ అయ్యి ఎందుకు? ఏమిటి? అని అడగగా అందుకు రవిబాబు, “అప్పుడు అనసూయ సినిమా కోసం నేను నా పాత్ర కోసం నా గడ్డం, జట్టు తో అలాగే కనుబొమ్మలను కూడా తీయించుకున్నాను. కానీ ఇందుకు విరుద్ధంగా ఆ తరువాత రోజు భూమిక ఫోన్ చేసి తనకు వొంట్లో బాలేదని ముంబై వెళ్లిపోతున్నా అని చెప్పింది. ఆలా 40 రోజులు గడిచాయి. అన్ని రోజులు నేను బయటకు వెళ్లకుండా, ఎవ్వరికీ నా మొహం చూపించకుండా తిరిగాను. ఆమె ఒక్కరోజు ముందుగా నాకు ఫోన్ చేసి చెప్పి ఉంటే నాకు అంత సమస్య ఉండేది కాదు” అంటూ చెప్పుకొచ్చారు.