రోజూ టివిలో ఏదొక టైం లో ఏదొక ఛానల్ లో యాంకర్ రవి కనిపిస్తూనే ఉంటాడు. ప్రస్తుతం రవి బుల్లితెర స్టార్ యాంకర్ అని చెప్పొచ్చు. ఎప్పుడూ ఏదొక షో లో సందడి చేస్తూనే ఉంటాడు రవి. ఈ టివి ఛానల్ లో పటాస్ షో నుంచి బయటకు వచ్చిన రవి ప్రస్తుతం ప్రముఖ టీవీ చానెల్స్ లోని షో లు హోస్ట్ చేస్తున్నాడు. అలాగే సొంతంగా ఒక యూ ట్యూబ్ ఛానల్ పెట్టి అందులో కూడా రకరకాల ప్రోగ్రాంస్ ను అప్లోడ్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
అప్పటిలో బిగ్ బాస్ సీజన్ 4 ముగిసిన టైం లో బిగ్ బాస్ కంటెస్టంట్స్ అభిజిత్ మరియు హారిక ఫామిలీస్ తో రవి చేసిన ఇంటర్వ్యూ స్ కు బాగా ట్రెండ్ అయ్యాయి. ఈ ప్రోగ్రాం చుసిన వారికి బిగ్ బాస్ షో సీజన్ 4 విన్నర్ అభిజిత్ కి రవి దగ్గర బంధు వే అని అర్ధం అవుతుంది.
ఇదిలా ఉండగా రవి షో ముగిసినప్పటి నుంచి అభిజిత్ అండ్ గ్యాంగ్ తో ఒక షో ప్లాన్ చేస్తున్నాడు. అభిజీత్ అండ్ గ్యాంగ్ అంటే అభిజిత్, హారిక, లాస్య, నోయెల్. వీరితో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ను ప్లాన్ చేస్తున్నాడు రవి. రవికి లాస్యతో ఉన్న ఐదేళ్ల గ్యాప్ కూడా ఈ మధ్యనే ముగిసింది. కాబట్టి ఇప్పుడు రవి యూట్యూబ్ లో ఇంటర్వ్యూ ఇచ్చేందుకు లాస్య కూడా రెడీ అనమాట.
రవి త్వరలోనే బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 4 లోని క్రేజీ 4 తో స్పెసల్ చిట్ చాట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అలాగే ఈ ఇంటర్వ్యూ కూడా చాలా ప్రత్యేకంగా ఉండనున్నట్లు సమాచారం.