Raviteja : రవితేజ అకౌంట్ లో మరొక క్రేజీ ప్రాజెక్ట్ యాడ్ అయింది. ఇటీవల క్రాక్ సినిమాతో అద్భుతమైన హిట్ అందుకున్నాడు మన మాస్ మహారాజ రవితేజ. మూడేళ్ళ నుంచి ఎదురు చూస్తున్న సాలీడ్ కమర్షియల్ హిట్ ఈ సినిమాతో దక్కింది. దాంతో ఫుల్ ఫాంలోకి వచ్చాడు. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా మాత్రమే కాదు .. కరోనా కారణంగా ఇండస్ట్రీ మొత్తం ఊబిలోకి కూరుకు పోయి మేకర్స్ అందరూ తమ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అని సందేహం లో ఉన్న సమయం లో రవితేజ క్రాక్ సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టాడు.
టాలీవుడ్ ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకు వచ్చాడు. ఈ క్రమంలో రవితేజ ప్రస్తుతం ఖిలాడి అన్న సినిమా చేస్తున్నాడు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ పతాకాలపై జయంతి లాల్ గడ సమర్పణలో సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. డ్యూయల్ రోల్ లో పక్కా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుండగా డింపుల్ హయతీ, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఖిలాడి సినిమాకి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక శరవేగంగా చిత్రీకరణ సాగుతున్న ఈ సినిమా నుంచి మహా శివరాత్రి పండుగ సందర్భంగా టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు సమాచారం.
Raviteja : రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తర్వాత రవితేజ 68 ప్రారంభం కానుంది.
అయితే ఈ సినిమా తర్వాత రవితేజ నటించబోతున్న సినిమాని తాజాగా ప్రకటించాడు. రవితేజ కెరీర్ లో 68 వ సినిమా రాబోతున్న ఈ సినిమాకి నక్కిన త్రినాథ రావు దర్శకత్వం వహిస్తున్నాడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమాని టిజి విశ్వ ప్రసాద్ అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా రవితేజ నటిస్తున్న ఖిలాడి సినిమా తర్వాత రవితేజ 68 ప్రారంభం కానుంది. ఇక త్వరలో ఈ సినిమాలో నటించే హీరోయిన్..సహ మిగతా నటీ నటులను ప్రకటించనున్నారు.