Raviteja : మాస్ మహారాజా రవితేజ ఇటీవల వచ్చిన మాస్ బ్లాక్ బస్టర్ ‘క్రాక్’ సినిమాతో భారీ హిట్ అందుకొని మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ‘రాజా ది గ్రేట్’ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వరుస ఫ్లాప్స్ తో సతమతమయిన రవితేజ హిట్స్ కోసం ఎంతో తాపత్రయపడ్డాడు. ఇలా ఫ్లాప్స్ వస్తుండటంతో ఇక రవితేజ పనైపోయిందని కూడా చెప్పుకున్నారు. అయితే గోపీచంద్ మలినేని మాస్ రాజాకి మంచి బ్లాక్ బస్టర్ ఇవ్వడంతో వరుసగా ప్రాజెక్ట్స్ లైనప్ చేసుకుంటున్నాడు.
అంతేకాదు ఒకదాని తర్వాత ఒక మూవీని పూర్తి చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో మాస్ ఎంటర్ టైనర్ గా డ్యూయల్ రోల్ లో ‘ఖిలాడీ’ అనే సినిమాను చేస్తున్నాడు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జయంతీ లాల్ గడ నిర్మిస్తున్నారు. అర్జున్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చిన ఈ సినిమా త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. ఇక రీసెంట్గా ‘రామారావు ఆన్ డ్యూటీ’ అనే మరో సినిమాను సెట్స్ మీదకి తీసుకు వచ్చాడు.
Raviteja : టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో రవితేజ..?
ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతోంది. కాగా ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రవితేజ కూడా ఓ పాన్ ఇండియన్ సినిమా కూడా చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడని సమాచారం. స్టువర్ట్ పురం దొంగ, క్రిమినల్ అయిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా ఈ బయోపిక్ తెరకెక్కనుందట. దీనికి కమర్శియల్ అంశాలు జోడించి మాస్ రాజా ఇమేజ్ కు తగ్గట్టు భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని నిర్మాత అభిషేక్ అగర్వాల్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలో దీనికి సబంధించిన ప్రకటన రానున్నట్టు సమాచారం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?