Balakrishna : నట సింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సినిమా అఖండ. ఈ సినిమాకి పోటీగా మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఖిలాడి అనుకున్నారు. అందుకు కారణం ఈ రెండు సినిమాలు మే 28న రిలీజ్ చేయనున్నట్టు రెండు చిత్ర బృందాలు వెల్లడించడమే. బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. శ్రీకాంత్ విలన్గా ఆయనకి జంటగా పూర్ణ కనిపించబోతున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా రూపొందుతుండగా కరోనా సెకండ్ వేవ్ దెబ్బకి షూటింగ్ దశలోనే ఆగిపోయింది. దాంతో రిలీజ్ ఆగిపోయింది.
ఇక రవితేజ – రమేష్ వర్మ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమా కూడా షూటింగ్ దశలో ఆగిపోయింది. దాంతో బాక్సాఫీస్ వద్ద బాలయ్య – రవితేజల మధ్య భారీ పోటీ ఉంటుందనుకుంటే ఇప్పుడు సీన్ మారిపోయింది. కానీ బాలాయ్య తో ఓ పాన్ ఇండియన్ స్టార్ పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది. ఆ హీరోనే యష్. కన్నడ రాకింగ్ స్టార్ గా ఇప్పుడు యష్ కి మంచి క్రేజ్ ఉంది. అంతేకాదు కేజీఎఫ్ తో పాన్ ఇండియన్ స్టార్ గా కూడా మారాడు. ఇప్పుడు కేజీఎఫ్ ఛాప్టర్ 2 రిలీజ్ చేసేందుకు సిద్దమవుతున్నాడు. ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకుడు. ఇప్పటికే భారీ అంచనాలున్నాయి.
Balakrishna : బాలయ్య – యష్ ల మధ్య బాక్సాఫీస్ వార్…
అయితే కేజీఎఫ్ 2, బాలయ్య అఖండ బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడనున్నాయని తాజాగా ఓ వార్త సోషల్ మీడియలో చక్కర్లు కొడుతోంది. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. పాన్ ఇండియన్ సినిమాగా కేజీఎఫ్ 2కి భారీ స్థాయిలో అంచనాలున్నాయి. మరి బాలయ్య – యష్ ల మధ్య బాక్సాఫీస్ వార్ ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి. కాగా నాగ చైతన్య ‘లవ్ స్టోరీ’, నాని ‘టక్ జగదీష్’, రానా ‘విరాట పర్వం’ సినిమాలతో పాటు మరి కొన్ని మీడియం బడ్జెట్ సినిమాలను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్, రవితేజ క్రాక్ కూడా రీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?