క్రాక్ .. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ సినిమా. మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ – గోపీచంద్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రి సినిమా. రవితేజ కి బలుపు, డాన్ శీను లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గోపీచంద్ మలినేని క్రాక్ తో హ్యాట్రిక్ హిట్ ఇవ్వడం ఖాయమని ఇప్పటికే ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఇక రవితేజ ఫ్యాన్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. అందుకు కారణం ఇప్పటికే రవితేజ ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి తాజాగా రిలీజైన రవితేజ – శృతి హాసన్ ల సాంగ్ వరకు అన్నింటికి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడమే.
కాగా రవితేజ ఈ సినిమాని సంక్రాంతి బరిలో దింపబోతున్నాడు. జనవరి 14 న రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ చేశాడు. దాంతో ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఒంగోలులో జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్నాడు. ఈ అంశం కూడా సినిమాకి పెద్ద ప్లస్ అవుతుందని రవితేజ చాలా నమ్మకంగా ఉన్నాడు. ఇక శృతి హాసన్ కి కూడా ఈ సినిమా సక్సస్ చాలా కీలకం. ఇక ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారాగణం తో పాటు హాట్ బ్యూటీ అప్సర రాణి స్పెషల్ సాంగ్ సినిమాకి అడిషన్ అట్రాక్షన్ అని మేకర్స్ చెప్పుకొస్తున్నారు.
ఇక ఈ సినిమా మీద భారీ అంచనాలున్నా కూడా రవితేజ తో పాటు గోపీచంద్ ల గత చిత్రాల రిజల్ట్ ప్రభావం మాత్రం కాస్త ప్రభావం చూపిస్తుందా అన్న టాక్ కూడా ఉంది. పొరపాటున కాన్సెప్ట్ లో గనక కొత్తదనం లేకపోతే రిజల్ట్ మీద గట్టిగానే ప్రభావం చూపిస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమా మీద రవితేజ – గోపీచంద్ మలినేని మాత్రం ఎంతో ధీమాగా ఉన్నారు. భారీ సక్సస్ ని ఆశిస్తున్నారు. చూడాలి మరి ఈ సినిమా రిలీజయ్యాక ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ ఖిలాడి అన్న సినిమాతో పాటు మరొక సినిమా కూడా చేస్తున్నాడు.