Tollywood: మాస్ మహారాజా రవితేజ వరుస ఫ్లాపులతో గత కొంతకాలం కెరీర్ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో క్రాక్ తో భారీ విజయం సాధించి మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కారు. డాన్ శీను, బలుపు వంటి రెండు బ్లాక్ బస్టర్ లు ఇచ్చిన డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కి బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. గత ఏడాది కరోనా లాక్డౌన్ తర్వాత సినిమా థియేటర్లు.. ఓపెన్ అయిన తర్వాత రిలీజ్ అయిన ఈ సినిమా బంపర్ విజయం సాధించి రవితేజ అభిమానులను ఎంతగానో అలరించింది.
ఈ సినిమా ఇచ్చిన విజయంతో మంచి జోరు మీదున్న రవితేజ సినిమాలు ఎంపిక చేయటం అదేరీతిలో హీరోయిన్లు సెలక్షన్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గతంలో తన నటించిన సినిమాలలో “కిక్” సినిమా మినహా మిగతా సినిమాలో హీరోయిన్ గా చేసిన ఇలియానా.. సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి.
ఇదిలా ఉంటె ఇటీవల మరోసారి రవితేజ.. తో ఓ డైరెక్టర్ సినిమా చేయడానికి రెడీ అవటం మాత్రమేకాక కథ ఓకే చేసిన క్రమంలో హీరోయిన్ గా ఇలియానా నీ తీసుకోవాలని రవితేజతో డిస్కషన్ పెట్టగా ససేమిరా అన్నట్టు ఇలియానాని రవితేజ పక్కన పెట్టి నట్టు లేటెస్ట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇలియానా తో నటించిన సినిమాలలో చాలా వరకు ఫ్లాప్ అయిన క్రమంలో ఆ సెంటిమెంట్ దృష్టిలో పెట్టుకుని రవితేజ ఆమెను పక్కన పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.