Raviteja : తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైందా అంటే ఇప్పటిది కాదు ఎప్పటి నుంచో ఈ ట్రెండ్ ఉంది అంటున్నారు. అదేమిటంటే ఓ దర్శకుడు, నిర్మాత కలిసి ఒక హీరోకి కథ అనుకుంటారు..తయారు చేసుకుంటారు. హీరో కూడా ఒకే అంటాడు. కానీ రక రకాల రీజన్స్ ఆ ప్రాజెక్ట్ కి బ్రేక్ వేస్తాయి. ముఖ్యంగా హీరో అనుకున్న ప్రాజెక్ట్స్, ఆయా దర్శకులు..కొన్ని పరిస్థితులు అనుకున్న సమయానికి పూర్తి కాక పోవడమే. దాంతో హీరోతో అనుకుంటే ఇంకో హీరో చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు డైరెక్టర్ త్రినాథ రావు నక్కిన పరిస్థితి అదేనట.
క్రాక్ సినిమా రవితేజని మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కించి ఊపునిచ్చింది. ఈ సినిమా ఇచ్చిన హై ఓల్టేజ్ తో లైనప్ బాగా చేసుకున్నాడు రవితేజ. రమేష్ వర్మ ఆ మధ్య రాక్షసుడు అన్న సినిమా తీసి హిట్ అందుకున్నాడు. ఆయన దర్శకత్వంలో ఖిలాడిలో నటించడాని ఒకే చెప్పాడు. సినిమా షూటింగ్ కూడా 90 శాతానికి పైగానే పూర్తి చేశారని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత కూడా ఓ సినిమా మొదలు పెట్టడానికి ఇటీవల పూజా కార్యక్రమాలు జరిపారు. దివ్యాంశ కౌశిక్ ని రవితేజ కి జోడిగా ఎన్నుకున్నారు. ఆమెకి ఇక్కడ రెడవ సినిమానే. కరోనా వల్ల ఆలస్యం అయింది. లేదంటే షూటింగ్ మొదలై జెట్ స్పీడ్ లో పూర్తి చేసుండేవారు.
Raviteja : వరుణ్ తేజ్ తో సినిమా అనేది హాట్ టాపిక్ అవుతోంది.
ఈ క్రమంలో త్రినాథ రావు సినిమా కూడా ఉండాల్సిందే. కానీ ఇప్పుడు రవితేజ కంటే ఆయన ముందు వరుణ్ తేజ్ తో సినిమా చేబోతున్నాడని అంటున్నారు. రవితేజతో ఈ డైరెక్టర్ ప్రాజెక్ట్ ఉందా లేదా అనే విషయం పక్కన పెడితే ఇప్పుడు వరుణ్ తేజ్ తో సినిమా అనేది మాత్రం కాస్త హాట్ టాపిక్ అవుతోంది. గని..బాక్సింగ్ నేపథ్యంలో వరుణ్ తేజ్ – సాయీ మంజ్రేకర్ నటిస్తున్న సినిమా. దీనితో పాటే వరుణ్ ఎఫ్ 3 సినిమాను అనిల్ రావిపూడి డైరెక్షన్ లో చేస్తున్నాడు. వెంకటేష్ ఇంకొక హీరో అని తెలిసిందే. ఈ రెండు పూర్తయ్యాక డైరెక్టర్ త్రినాథ రావుతో వరుణ్ సినిమా ఉండే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు.