Raviteja : రవితేజ క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ తో మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. గత మూడేళ్ళ ఫ్లాపుల్లో ఉన్న లైఫ్ ఒక్కసారిగా యూ టర్న్ తీసుకుంది. క్రాక్ ఇచ్చిన కిక్ తో వరసగా ప్రాజెక్ట్స్ ని లైనప్ చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ వచ్చి అందరినీ ఆకట్టుకుంది. ‘ప్లే స్మార్ట్’ అన్న ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతున్న ఖిలాడి సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌధరి, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘ఖిలాడీ’ సినిమాని 2021 సమ్మర్ లో విడుదల చేసేందుకు దర్శక, నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా ఈ సినిమా తర్వాత రవితేజ త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ వక్ కూడా పూర్తైందట. త్వరలో సెట్స్ మీదకి తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Raviteja : రవితేజ కి జంటగా ప్రియాంక అరుల్ ని ఫైనల్ ..?
ఈ క్రమంలో ఈ సినిమాలో నటించే హీరోయిన్ తో పాటు ఇతర నటీ నటుల ఎంపిక జరుగుతున్నట్టు తాజా సమాచారం. అందులో భాగంగా ఈ సినిమాలో రవితేజ కి జంటగా ప్రియాంక అరుల్ ని ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది. నేచురల్ స్టార్ నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన ప్రియాంక అరుల్ టాలీవుడ్ మేకర్స్ ని ఆకట్టుకుంది. ప్రస్తుతం యంగ్ హీరో శర్వానంద్ తో శ్రీకారం చేస్తోంది. కాగా ఇప్పుడు రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కించుకుందని టాలీవుడ్ టాక్. ఇదే నిజమైతే టాలీవుడ్ లో ప్రియాంక అరుల్ సెటిలైనట్టే అంటున్నారు.