Raviteja : రవితేజ నటిస్తున్న ఖిలాడి రిలీజ్ డేట్ లాక్ చేశారు చిత్ర యూనిట్. రీసెంట్ గా ‘క్రాక్’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ చాలాకాలం తర్వాత ఫాం లోకి వచ్చేశాడు. సాలీడ్ హిట్ అందుకున్న రవితేజ వరసగా జోరు చూపించేందుకు రెడీ అయ్యాడు. ఈ క్రమంలో ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నాడు. గత ఏడాది ‘రాక్షసుడు’ భారీ హిట్ అందుకున్న రమేష్ వర్మ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. రవితేజ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు. మాస్ మహారాజా కి జంటగా హాట్ బ్యూటీస్ మీనాక్షి చౌధరి – డింపుల్ హయతి హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ హీరో అర్జున్ విలన్ గా కనిపించబోతున్నాడు.
ఇక ఈ సినిమాని పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ గడ సమర్పణలో హవీష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సత్యనారాయణ కోనేరు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. కాగా ఇటీవల రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ గ్లిమ్స్ రవితేజ అభిమానుల నుంచి .. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయిందని టాక్ వచ్చింది. ఇప్పటికే టాలీవుడ్ లో మీడియం బడ్జెట్ సినిమాల నుంచి పాన్ ఇండియన్ సినిమాల వరకు ఆయా చిత్రాల రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ ఇస్తున్నారు.
Raviteja : త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ సెట్స్ మీదకి రాబోతోంది..?
అలాగే మన మాస్ మహారాజా రవితేజ ఖిలాడి కూడా మే 28 న రిలీజ్ చేస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ఈ అనౌన్స్ మెంట్ తో రవితేజ ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. ఈ ఏడాది క్రాక్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రవితేజ క్రాక్ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చెప్పుకుంటున్నారు. కాగా రవితేజ నుంచి ఈ ఏడాదే మరో సినిమా కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. త్వరలో త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ సెట్స్ మీదకి రాబోతోంది. ఇదుకు సంబంధించిన అధికారక ప్రకటన అతి త్వరలో రానుందని అంటున్నారు.