NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

జనసేన వైపు ఆ వైసీపీ నేత చూపు … చేరిక మూహూర్తం ఖరారు అయినట్లే(నా)..?

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గ వైసీపీ నేత బొంతు రాజేశ్వరరావు నిన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రెండు నెలల క్రితమే రాజేశ్వరరావు పంచాయతీరాజ్, ఆర్ డబ్ల్యుఎస్ రాష్ట్ర సలహదారు పదవికి రాజీనామా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన గెలిచిన ఏకైక స్థానం రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం. రిజర్వ్ డ్ నియోజకవర్గమైన రాజోలు అసెంబ్లీ నియోజకవర్గం నుండి రాపాక వరప్రసాద్ జనసేన అభ్యర్ధిగా అయిదువేల ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్ధి బొంతు రాజేశ్వరరావుపై గెలిచారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు స్థానాల్లో పరాజయం పాలవ్వగా, రాజోలులో మాత్రం రాపాక వరప్రసాద్ గెలుపొందారు.

Razole YCP Leader Rajeswara Rao Meets Pawan Kalyan జనసేన

 

అయితే ఈ గెలుపు తన వ్యక్తిగత చరిష్మాతో దక్కిందన్న భావనతో ఉన్న రాపాక గెలిచిన కొద్ది రోజుల్లోనే వైసీపీకి దగ్గర అయ్యారు. వైసీపీ ఇన్ చార్జిగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి రాపాక వరప్రసాద్ 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి అయిదువేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో తొలి సారి ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు జరిగిన త్రిముఖ పోటీలో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్ధిపై రాపాక వరప్రసాద్ విజయం సాధించారు. ఆ తరువాత 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసిన రాపాక నాల్గవ స్థానంలో నిలిచారు. నోటా కంటే తక్కువగా కేవలం 318 ఓట్లు మాత్రమే తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో జనసేన క్యాడర్ బలంగా ఉండటంతో రాపాక ఆ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Razole YCP Leader Rajeswara Rao

భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

రాపాక వైసీపీ దగ్గర కావడం, రాబోయే ఎన్నికల్లో తానే అభ్యర్ధిగా సంకేతాలు ఇవ్వడంతో రెండు సార్ల వైసీపీ తరపున పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలైన నియోజకవర్గ పార్టీ నేత బొంతు రాజేశ్వరరావు కొంత కాలంగా సైలెంట్ అయ్యారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన సీఎం జగన్మోహనరెడ్డి ఆయనకు పీఆర్, ఆర్ డబ్ల్యుఎస్ రాష్ట్ర సలహాదారుగా నియమించగా, ఆయన రెండు నెలల క్రితం ఆ పదవికి రాజీనామా చేశారు. రెండు సార్లు పోటీ చేసిన తనను కనీసం ఇన్ చార్జిగా కూడా కొనసాగించకుండా అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటి నుండి వైసీపీతో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హజరు కావడం లేదు.ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ తో రాజేశ్వరరావు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలో ఆయన జనసేన పార్టీ లో చేరడం ఖాయమన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఈ నెల 15న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా కప్పుకునే చాన్స్ ఉందని అంటున్నారు. ఆదివారం జరిగిన పవన్ కళ్యాణ్ తో జరిగిన భేటీలో పార్టీలో చేరికపై చర్చించినట్లు సమాచారం.

నిరుద్యోగ యువతకు బంపర్ ఆఫర్ ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju