#RC15: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలయికలో ఓ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ అయినప్పటి నుంచి అందరూ ముందుగా మాట్లాడుకుంది చరణ్ లుక్ ఎలా ఉండబోతోంది..శంకర్ ఎలా చూపించబోతున్నారు అనే. అందుకు కారణం శంకర్ సినిమాలలో హీరోలు తప్పకుండా ఓ డిఫరెంట్ మేకోవర్‌లో నటిస్తుండటమే. ఇది చరణ్ కెరీర్లో 15వ సినిమాగా తెరకెక్కుతున్న విషయం అని తెలిసిందే.
ఇది చరణ్ మైల్స్టోన్ మూవీ. అంతేకాదు నిర్మాత దిల్ రాజు నిర్మాణ సంస్థకు కూడా ఈ సినిమా మైల్ స్టోన్ మూవీ. ఆ సంస్థ నుంచి వస్తున్న 50వ సినిమా కావడం విశేషం. అందుకే ఇందులో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. ఈ పాన్ ఇండియన్ సినిమా ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ చేసి శరవేగంగా షూటింగ్ జరుపుతున్నారు. ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూణెలో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్లో ‘కేజీయఫ్’ స్టంట్ మాస్టర్స్ అనుబ్ – అరివ్ ఆధ్వర్యంలో చరణ్ పాల్గొనగా ఓ భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు.
#RC15: చరణ్‌ను ఈ సాంగ్‌లో సూపర్ ఫ్యాన్సీ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అయింది. ఈ షెడ్యూల్లో చరణ్ – కియరాలపై శంకర్ ఓ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. శంకర్ సినిమాలలో సాంగ్స్ ఏ రేంజ్లో ఉంటాయో అందరికీ తెలిసిందే. ఒక్క సాంగ్ కోసమే భారీ బడ్జెట్ తో సెట్స్ నిర్మాణం..గ్రాండ్ విజువల్స్ తో తెరకెక్కిస్తుంటారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న సాంగ్ కూడా అదే రేంజ్లో ఉంటుందట. అంతేకాదు చరణ్‌ను ఈ సాంగ్‌లో సూపర్ ఫ్యాన్సీ లుక్‌లో కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సాంగ్‌కు జానీ మాస్టర్ డాన్స్ కొరియోగ్రఫీ అందిస్తున్నారు. థమన్ సంగీత దర్శకుడు.