Cash Program: ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ ఈటీవీ లో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రాం ను కొన్ని లక్షల మంది చూస్తూ ఉంటారు. ఈ ప్రోగ్రాం కి హోస్ట్ గా సీనియర్ యాంకర్ సుమ కనకాల వ్యవహరిస్తున్న విషయం మనకి తెలిసిందే. అయితే ఈ షో ని చూస్తున్న చాలా మందికి కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అవి ఏమిటంటే, ఆ షో కి వచ్చే గెస్ట్ లకి వారు చివరిగా గెలుచుకున్న ప్రైస్ మనీ ని నిజంగానే వారికి ఇస్తారా? ఆ షో కి వచ్చే ఆడియన్స్ కి ఎంత పే చేస్తారు? క్యాష్ షో లో చివరి రౌండ్ లో సామాన్లు పై నుంచి కిందకి పడేస్తున్నట్లు చూపిస్తారు. అలా నిజంగా పడేస్తారు? ఇటువంటి సందేహాలు ఎన్నో వస్తూ ఉంటాయి. అయితే ఇందులో ఉన్న నిజానిజాలు ఇపుడు తెలుసుకుందాం.
క్యాష్ షో నే కాకుండా ఇటువంటి రియాలిటీ షోస్ చూస్తున్నప్పుడు ప్రజలకు సాధారణంగా ఇటువంటి సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇక ముందుగా ఆ షో లో పార్టిసిపేట్ చేస్తున్న వారికీ ప్రైస్ మనీ ఎంత ఇస్తారు అంటే…. వచ్చిన వారి రేంజ్ ను బట్టి 10 వేలు నుంచి 20 వేలు వరకు ఇస్తూ ఉంటారు. అదే సినిమా ప్రొమోషన్స్ కోసం ప్రోగ్రాం కి వస్తే వారికి షో నిర్వాహకులు ఏమి చెల్లించరు.
ఆ తరువాత ఆ షో కి వచ్చే ఆడియన్స్ విషయానికి వస్తే అక్కడికి వచ్చే స్టూడెంట్స్ కి ఎటువంటి డబ్బు ఇవ్వరు కానీ భోజనాలు పెడతారట. ఇంతక ముందు జూనియర్ ఆర్టిస్ట్ లను తీసుకొచ్చినప్పుడు వారికి రోజుకి 700-800 రూపాయలు చెల్లించాలిసి వచ్చేది. ఇపుడూ స్టూడెంట్స్ రావడం వలన వారికి ఈ ఖర్చు కూడా తగ్గిందనే చెప్పాలి.
చివరిగా ప్రోగ్రాం చివరిలో పై నుంచి కిందకి పడేసే సామానులు విషయానికి వస్తే వాటి కోసం పాత సామానులను సేకరించి కొత్తగా కనిపించేలా చేస్తారట. వీటి ఖర్చు మొత్తం మీద 5-7 వేల రూపాయలు మాత్రమే ఉంటుందట.