సీనియర్ యాంకర్ భార్గవి తెలుగు ఇళ్లల్లో బాగా తెలిసిన వ్యక్తి. ఆమె ఒకప్పుడు బుల్లితెరపై స్టార్ హోదాని దక్కించుకుంది. భార్గవి, కలర్స్ స్వాతి, ల మధ్య అప్పట్లో మంచి పోటీ నడిచేది. అయితే యాంకర్ శ్రీముఖి, అనసూయ, రష్మి, ల ఎంట్రీతో భార్గవి వెనబడ్డారనే చెప్పాలి. అయితే అడపాదడపా సినిమాల లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కనిపిస్తూనే ఉంది ఆమె . అత్తారింటికి దారేది.. జనతా గ్యారేజ్ రీసెంట్‌గా రామ్ గోపాల్ వర్మ ‘మర్డర్’ చిత్రంలో అమృత పాత్రలో నటించి మెప్పించింది.
తాజాగా తన జర్నీ గురించిగుర్తు చేసుకున్న భార్గవి.. యాంకర్ అనసూయ గురించి పలు ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. నేను బిజీగా ఉన్నప్పుడు ఏదైనా అవకాశం వస్తే అనసూయకి ఫోన్ చేసి చెప్పేదాన్ని. నేను వేరే ఈవెంట్స్ చేయాలి నువ్వు దీనికి వెళ్తావా అనసూయా అని అడిగి మరీ ఈవెంట్ ఇచ్చేదాన్ని. ఎందుకంటే నా ముందున్న యాంకర్లు మాకు ఇలా చేయడం నేర్పారు.
సుమక్క, ఝాన్సీ అక్క, సునీత బిజీగా ఉంటే.. ఫోన్ చేసి.. భార్గవి నువ్ వెళ్తావా?? మాకు వేరే షూటింగ్ ఉంది అని మాకు అవకాశం ఇచ్చేవారు. నేను కూడా అనసూయ కు అలా అవకాశం ఇచ్చేదాన్ని. నేను మా ఆయనతో కలిసి అస్సాంలో ఉన్నప్పుడు నాకు చాలా ఈవెంట్లు వచ్చేవి. నేను వెళ్లడం కుదరక ఎక్కువ అనసూయకి ఫోన్ చేసి వెళ్తావా? అని అడిగేదాన్ని. ఇప్పటికీ కూడా నేను వెళ్లలేకపోతే,వేరే యాంకర్లకు ఫోన్ చేసి చెప్తా. మా సీనియర్స్ నుంచి నేను అది నేర్చుకున్నా అని చెప్పుకొచ్చారు .
ఒకప్పుడు నేను అవకాశం ఇచ్చిన యాంకర్లు ఇప్పుడు టాప్ పొజిషన్‌లో ఉండటం చాలా సంతోషం గా ఉంది. అందరూ అలాగే ఎదగాలనికోరుకుంటున్న. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే.. టాలెంట్ లేకుండా ఈ ఫీల్డ్‌లో నిలబడడం చాల కష్టం. వాళ్ల లో టాలెంట్ ఉంది కాబట్టే ఆ స్థాయి కి వెళ్లగలిగారు అంటూచెప్పుకొచ్చారు భార్గవి.
pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న పాన్…
Hero Yash: కన్నడ స్టార్ హీరో యశ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాంకింగ్ స్టార్ గా అందరూ పిలుస్తూ…
Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్, ప్రముఖ డైరెక్టర్ మారుతి కాంబినేషన్లో రూపుదిద్దుకున్న తాజా చిత్రం `పక్కా కమర్షియల్`.…
Sudigali Sudheer : సుడిగాలి సుధీర్ మంచి కమెడియన్‌గా తెలుగు ప్రేక్షకుల్లో పేరు తెచ్చుకున్నాడు. సుధీర్ కమెడియన్ మాత్రమే కాదు…
Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. `ఛలో`తో టాలీవుడ్లోకి అడుగు పెట్టి అనతి…
Pears: యాపిల్ పండు లాగానే కనిపించే పియర్స్ పండు చాలా రుచిగా ఉంటాయి.. ఇందులో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.. కానీ…