కొంతమందికి నెంబర్స్ పై ఇంట్రస్ట్, సెంటిమెంట్ మామూలుగా ఉండదు! నేడు వారు ఉన్న స్థితికి, పరిస్థితికి ఆ లక్కీ నెంబరే కారణం అని ఫీలవుతుంటారు. వారి ఎదుగుదలకు వారి కష్టం కంటే ఎక్కువగా ఈ సంఖ్యలు, జాతకాలు కూడా కలిసొచ్చాయని నమ్ముతుంటారు! ఆ సంగతులు కాసేపు పక్కనపెడితే… తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్కీ నెంబర్ మరోసారి తెరపైకి వచ్చింది! దానికి కారణం… ఆయన కలల సచివాలయం నిర్మాణంలో ప్రతీచోటా ఆరు నెంబర్ ఉండేలా ప్లాన్ చేసుకోవడమే!!
అవును… తన కలల సచివాలయంలో అవకాశం ఉన్నా లేకున్నా… ఆరు సంఖ్య ఉండేలా ఫుల్ గా అ నెంబర్ ను వాడేస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్! తనకు అచ్చొచ్చిన ఆ నెంబర్.. తెలంగాణ నూతన సచివాలయంలో నిర్మాణంలో ఒక్క బడ్జెట్ విషయంలో తప్ప అన్నిచోట్లా దర్శనమిస్తోంది!
కేసీఆర్ కలల సచివాలయాన్ని “6” లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో “6” అంతస్థుల్లో నిర్మాణం చేయనున్నారు. ఇలా మొదలైన “6” సెంటిమెంట్… సచివాలయం చుట్టూ వచ్చే రోడ్డు వెడల్పు విషయంలో కూడా “6”0 (అరవై) అడుగుల వెడల్పు రూపంలో దర్శనమివ్వబోతోంది!
ఇదే క్రమంలో… ఈ కొత్త సచివాలయంలో “6” కాన్ఫరెన్స్స హాళ్లు.. “6” డైనింగ్ హాళ్లు.. “6” పార్కులు.. “6”0 (అరవై) మీటర్ల గుమ్మటం.. ఇలా అన్నింట్లోనూ “6” ఉండేలా సచివాలయాన్ని నిర్మిస్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్!
అన్నీ బాగానే ఉన్నాయి కానీ… ఈ సచివాలయం నిర్మాణానికి బడ్జెట్ మాత్రం 500 కోట్లు! ఇక్కాడొక్కచోటే “6” నెంబర్ మిస్సయ్యింది. ఇది కూడా “6”00 (ఆరువందల) కోట్లు అయ్యి ఉంటే ఇంకా డిఫరెంట్ గా ఉండేదనే కామెంట్లు ఈ సందర్భంగా వినిపిస్తున్నాయి! కాగా… కేసీఆర్ కార్ నెంబర్ కూడా 6666!!