NewsOrbit
న్యూస్

నీలం సహానీ… జగన్ కు అంత పాజిటివ్ బూస్ట్ ఏలా అయ్యారు?

రాష్ట్ర ప్రభుత్వ అధికారుల్లో అత్యంత కీలక బాధ్యత నిర్వహిస్తూ, అధికారుల్లో ప్రభుత్వ ప్రతినిధిగా ఉండే అత్యంత కీలక పోస్టు సీఎస్. అయితే ఇప్పుడు ఏపీ సీఎస్ గా నీలం సహానీ కొనసాగడం, ఆమె పదవీకాలాన్ని మరింతగా పెంచాలని జగన్ కోరడం.. అందులో భాగంగా మరో మూడు నెలలు ఆమె బాధ్యతలు పొడిగించడం జరిగిపోయింది. ఈ విషయంలో జగన్ అంతగా ఆమెవిషయంలో పట్టుబట్టడం ఎందుకు అనే విషయాలపై చర్చలు నడుస్తున్నాయి. అయితే… ఈ చర్చల్లో మెజారిటీగా తేలుతున్న విషయం ఏమ్మిటంటే… ఆమె జగన్ కు పాజిటివ్ బూస్ట్ అయ్యారని!

ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ కోరడంపై ఒకటి రెండు విమర్శలు వచ్చినా… గతంలో కూడా ఇలా రాష్ట్ర ప్రభుత్వాలు చీఫ్ సెక్రటరీల పదవీకాలాన్ని పొడిగించిన సందర్భాలు ఉన్నాయి.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఏపీలో సీఎస్ రమాకాంత్ రెడ్డి పదవీకాలాన్ని మూడు నెలల పాటు పొడిగించింది.. ఇదే క్రమంలో 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా పీకే మహంతీ పదవీకాలాన్ని నాలుగు నెలల పాటు పొడిగించింది అని వైకాపా నుంచి సమాధానాలు వచ్చాయి.

ఆ సంగతులు అలా ఉంటే… లాక్ డౌన్ కారణాలను దృష్టిలో పెట్టుకొని సహానీ పదవీ కాలాన్ని పొడిగించాలని జగన్ కోరినా క్రమంలో… కేవలం లాక్ డౌన్ మాత్రమే కారణం కాదని, జగన్ కు ఆమె చాలా కీలకంగా పనిచేస్తున్నారని… జగన్ కొత్త ఆలోచనలకు ఆమె సీనియారిటీ చాలా ఉపయోగకరంగా ఉందని అంటున్నారు. నిజం చెప్పాలంటే… ముఖ్యమంత్రిగా జగన్ కు ఇదే తొలి ఏడాది.. ఈ క్రమంలో సహానీ అనుభవం జగన్ కు అక్కరకు వచ్చిందని, అది ఆయనకు చాలా మంచి చేసిందని చెబుతున్నారు! ఈ కారణమే ఆమె పదవీ కాలాన్ని పొడిగించాలనే జగన్ రిక్వస్ట్ వెనక అసలు కారణం అని అంటున్నారు!

కాగా… 1984 బ్యాచ్‌ కు చెందిన ఐఎఎస్ అధికారి అయిన సహాని… ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో పలు జిల్లాల్లో కలెక్టర్‌ గా పనిచేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లా కలెక్టర్‌ గా సహాని సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య శాఖతో పాటు పలు కీలకమైన శాఖల్లో ఆమెకు పనిచేసిన అనుభవం ఉంది. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సహానీ 2019 నవంబర్ 13వ తేదీన బాధ్యతలు స్వీకరించారు. ఏపీ రాష్ట్రానికి మొదటి మహిళ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రికార్డు సృష్టించారు. సహానీ పదవీ కాలాన్ని పొడిగించాలని కోరుతూ ఈ ఏడాది మే 14వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్ లేఖ రాశారు.. దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఆమె సీఎస్ పదవిలో కొనసాగుతారు.

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?