Vallabhaneni Vamsi: అనరాని మాటలన్నదేమో వంశీ!అయినా టిడిపి ఆయనను టార్గెట్ చేయదేమి?

Share

Vallabhaneni Vamsi: ఆంధ్ర రాష్ర్టాన్ని కుదిపేస్తున్న చంద్రబాబు ఉదంతంలో అసలు ముద్దాయి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నది అక్షరసత్యం.ఆయన చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్ పుట్టుకపై చేసిన వ్యాఖ్యలు ఇంత దుమారం రేపాయి.అసెంబ్లీ బయట చాలా రోజుల క్రితమే వంశీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Reason behind TDP not targeting Vallabhaneni Vamsi
Reason behind TDP not targeting Vallabhaneni Vamsi

చివరకు అవి అసెంబ్లీదాకా వచ్చి వైసిపి ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు,ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిల నోటి ద్వారా మరోసారి వెలువడి చంద్రబాబు తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో తొలిసారిగా మీడియా సమావేశం కన్నీరు పెట్టడం వరకు దారితీసింది.అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఏకమయ్యారు.వైసిపి ప్రభుత్వానికి తీవ్రస్థాయిలో చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ వార్నింగ్ కూడా ఇచ్చారు.ఇదంతా బాగానే ఉన్నప్పటికీ అసలు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు గానీ టీడీపీ నేతలు గానీ లోకేష్ పుట్టుకపై అనుమానాలు వ్యక్తం చేసిన వల్లభనేని వంశీ ని ఒక్క మాట అనకపోవటం, ఆయన ప్రస్తావన లేకుండానే మీడియా సమావేశాలు జరిగిపోతుండడం ఆసక్తి రేపుతోంది.ఎందుకని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలెవ్వరూ వంశీని ఎవ్వరూ టచ్ చేయడం లేదన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది.

Vallabhaneni Vamsi: ముందేమి జరిగిందంటే !

డ్రగ్స్ కేసుకు సంబంధించిన వ్యవహారంలో సీఎం జగన్ ను ఉద్దేశించి టీడీపీ నేత పట్టాభి బోషడికే అని విమర్శించగా రాష్ట్రంలో అనేక గొడవలు రేగాయి.చివరకు టీడీపీ కార్యాలయం మీద కూడా దాడి జరిగింది.ఆ సందర్భంగా టిడిపి నుండి గెలిచి ప్రస్తుతం వైసిపికి మద్దతిస్తున్న వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడుతూ లోకేష్ ను ఉద్దేశించి “నీకు ఎందుకు ఎలిమినేటి మాధవరెడ్డి పోలికలున్నాయో మీ నాన్నకు తెలుసు.మాధవ రెడ్డి ఎలా చనిపోయాడో కూడా మీ నాన్నకు తెలుసు.ఆయనను అడిగి అన్ని విషయాలు తెలుసుకో”అనడం జరిగింది.ఆ వీడియో యూట్యూబ్లో వైరల్ కూడా అయింది.నిన్న రాత్రి కొన్ని ఛానళ్లు వంశీ బైట్లు కూడా చూపించాయి.ఇక శుక్రవారం అసెంబ్లీలో కూడా అంబటి రాంబాబు,ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆ తరహా ఆరోపణలు చేయడం వాస్తవమే.కానీ నిజానికి వారు వంశీ లాగ పచ్చిగా మాట్లాడలేదు.

పచ్చిగా మాట్లాడినా పట్టించుకోరా?

అంతా అయిపోయాక చంద్రబాబుతో సహా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, టిడిపి నేతలు దీనిపై రచ్చ చేస్తున్నప్పటికీ ఎవరు వంశీ ప్రస్తావన కూడా తేవడం లేదు.నిజానికి వంశీ గతంలో మాట్లాడిన వీడియో బయటకు వచ్చినప్పుడు కూడా ఎవ్వరూ స్పందించకపోవటం ఇక్కడ గమనార్హం .ఇప్పుడు కూడా టిడిపి నేతలు అదే తరహా వ్యూహం ఎందుకు అవలంబిస్తున్నారన్నది జవాబు దొరకని ప్రశ్న.దీనిపై కూడా రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతోంది.ఇక్కడ కూడా “సామాజిక కోణం” దాగి ఉందా అన్న అనుమానం కలుగుతోంది.తమ వాడైన వంశీని దాచిపెట్టి అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వంటి కాపులను,రెడ్లను టిడిపి నేతలు టార్గెట్ చేస్తున్నారా అని కొందరు సందేహిస్తున్నారు.ఇక ఈ వంశీ జూనియర్ ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడు కావడంతో అతడిని కెలికి లేనిపోని గొడవలు తెచ్చుకోవటం ఎందుకని టిడిపి నేతలు వల్లభనేని జోలికి పోవడం లేదన్నది మరో విశ్లేషణ.అయితే చిచ్చు రగిల్చిన వంశీ ని వదిలి కొనసాగింపు మాటలు మాట్లాడిన వారిని టిడిపి వెంటాడుతుండటం అనేక అనుమానాలకు తావిస్తోంది.


Share

Related posts

రాజకీయాలకు దూరంగానే ఉంటా

sarath

Bigg Boss 5 Telugu: షణ్ముఖ్ జస్వంత్ గ్రూప్ ప్లాన్ లు తలకిందులు చేసిన బిగ్ బాస్..!!

sekhar

Keerthi suresh: ఊపందుకుంటున్న కీర్తి సురేష్ ..ఇక కష్టమే అనుకుంటున్న సమయంలో వరుస ప్రాజెక్ట్స్‌కి సైన్ చేస్తోంది..

GRK