RTC Bus: ప్రతి ఆర్టీసీ బస్సు
మనం బస్సు ప్రయాణం చేసేటప్పుడు మనకు కావలసిన బస్సు కోసం ఎదురు చూసేటప్పుడు.. మనం వాటి నెంబర్ ప్లేట్స్ ని గమనిస్తాం. ఆర్టీసీ బస్సులు (Rtc Bus) కు ఉండే నెంబర్ ప్లేట్ లో Z అనే అక్షరం ప్రతి ఆర్టీసీ బస్సు మీద ఉంటుంది. దీని గురించి తెలియాలంటే మనం 87 ఏళ్లు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది.నిజాం రాజులు హైదరాబాద్ రాష్ట్రాన్ని పాలించిన రోజుల్లో రాష్ట్రంలో రవాణా కోసం రోడ్డు, రైలు మార్గాలను ఏర్పాటు చేశారు. దాని కోసం నిజాం స్టేట్ రైల్వే అండ్ రోడ్డు ట్రాన్స్ పోర్టు అనే ఒక సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది.
RTC Bus: జహ్రా బేగం పేరు
హైదరాబాద్ లో సిటీ బస్సు సర్వీసును మొట్ట మొదటి సారి సంస్థ ద్వారా 1932 లో ప్రారంభించారు. ఆ బస్సులు అప్పుడు హైదరాబాద్ పాలిస్తున్న చివరి నిజాం అయినా మీర్ ఉస్మాన్ అలీఖాన్ అతని తల్లి అయిన జహ్రా బేగం ( zahra begum) పేరు మీద నమోదు చేయించారు. ఆ విధం గా తల్లి పేరు వచ్చేలా Z అనే అక్షరం వచ్చేలా బస్సు నెంబర్ ను రిజిస్టర్ చేయించారు. అలా కొత్త బస్సు ను తీసుకు వచ్చినప్పుడల్లా అలాగే Z వచ్చేలా నెంబర్ ప్లేట్ ను తయారుచేసేవారు. ఆ సంప్రదాయం అలాగే కొనసాగింది.ఆ తర్వాత నిజాం హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి అప్పగించే సందర్భం లో ఒక షరతు పెట్టాడు.
తెలంగాణ, ఏపీలో
హైదరాబాద్ (Hyderabad) సంస్థానం పరిధిలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ద్వారా ఉపయోగించే ఏ బస్సు కైనా కూడా Z అనే అక్షరాన్ని ఖచ్చితంగా ఉపయోగించాలని ప్రభుత్వానికి కోరాడు. దీంతో ఆ సంప్రదాయం అలాగే ఇప్పటికి కొనసాగుతోంది. ఈ కారణంగా ఇప్పటికీ.. తెలంగాణ, ఏపీలో ఆర్టీసీ బస్సు లకు పెట్టె నెంబర్ ప్లేట్ లో Z అనే అక్షరం తప్పకుండా ఉంటుంది.