Bigg Boss 5 Telugu: లహరి హౌస్ నుండి ఎలిమినేట్ అవటానికి కారణం అదే అంటున్న జనాలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో మూడో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన లహరి ఆదివారం హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. అప్పట్లో హౌస్ లో అడుగు పెట్టే ప్రారంభంలో వస్తూనే నాగ్‌కు రోజ్‌ ఇచ్చి ప్రపోజ్‌ చేసింది. యాంకర్‌, న్యూస్‌ రీడర్‌, జర్నలిస్టు, మోడల్‌, నటిగా పాపులర్‌ అయింది లహరి షారి. సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసే ఈమె అర్జున్‌ రెడ్డిలో డాక్టర్‌గా నటించింది. మళ్లీ రావా సినిమాలో హీరో సుమంత్‌ స్నేహితురాలిగా ఆకట్టుకుంటుంది. సారీ నాకు పెళ్లైంది, జాంబిరెడ్డి తదితర చిత్రాల్లో నటించిన లహరి.. బిగ్ బాస్ హౌస్ లో గ్యారెంటీగా రాణిస్తుందని అందరూ భావించారు. కానీ ఆమె హౌస్ నుండి మూడవ వారం ఎలిమినేట్ కావటం అందరికీ షాక్ కు గురి చేసింది. ఈ క్రమంలో ఆమె ఎలిమినేట్ అవ్వడానికి గల కారణం గురించి బయట జనాలు సోషల్ మీడియాలో రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

హౌస్ లో ప్రారంభంలో.. ఎవరికి వారు చెక్ పెట్టుకుంటూ తనపై.. అత్యుత్సాహం చూపించిన కాజల్ నోటికి కూడా కళ్లెం వేయడం జరిగింది. ఆ విధంగా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే లహరి.. కొన్ని కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విషయాలకు కూడా కయ్యానికి రెడీ అవటం తో.. ఆమెను శభాష్ అన్న వాళ్ళ విమర్శించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో లహరి తో పెద్దగా దగ్గరవటానికి ఎవరు ముందుకు రాలేదు. ఉన్న మూడు వారాలలో మానస్ ఆమెకి కాస్త క్లోజ్ అయ్యాడు. ఆ తర్వాత ఇంటిలో కొంతమంది సభ్యులు ఆమె డ్రెస్ సెన్స్ గురించి కూడా తప్పుగా మాట్లాడటం జరిగింది. ప్రియాంక అదేరీతిలో ప్రియా సింగ్ సిరి.. లహరి ని టార్గెట్ చేసి మరీ హౌస్ లో ఆమెపై నెగిటివ్ టాక్ ప్రచారం చేశారు. ఇదిలా ఉంటే మానస్ లహరి గురించి తనకి.. ఎవరైతే ఏం చెప్పారో వాటన్నిటినీ ఆమెకు చెప్పటం తో.. ఆమె కాస్త జాగ్రత్త పడింది. ఇదిలా ఉంటే లహరి కేవలం డ్రెస్ అదేరీతిలో తన తో.. వాగ్వివాదానికి సంబంధించిన రెండిటిలో మాత్రమే.. హౌస్ లో స్క్రీన్ స్పేస్ దక్కించుకుందని.. మూడవ వారంలో.. ప్రియా రవి లహరి గొడవ తో… కొద్దో గొప్పో ఆమెకు స్పేస్ రావడం జరిగిందని… అయితే హౌస్ లో ఉన్నంతకాలం ఎంటర్టైన్ పరంగా టాస్క్ ఆడే విషయంలో లహరి వెనకబడి పోవడంతో ఆమె ఇంటి నుండి ఎలిమినేట్ అయినట్లు జనాలు భావించారు.

యాంకర్ రవి కారణంగా బలైపోయింది…

ఇదే తరుణంలో రెండవ వారం ఇంటి నుండి ఎలిమినేట్ అయిన ఉమాదేవి కూడా షోలో లహరి… వేస్ట్ అని తేల్చి చెప్పడం తెలిసిందే. పైగా పాపులారిటీ కూడా తక్కువగా ఉండటంతో .. మొదటి నుండి ఏమి కు తక్కువ ఓట్లు నమోదు కావడంతో లహరి ఎలిమినేషన్ కారణానికి ఇది కూడా ఒకటి అని జనాలు భావిస్తున్నారు. మొత్తంమీద చూసుకుంటే.. యాంకర్ రవి కారణంగా బలైపోయింది అని.. దానికి తోడు ఆమె యాక్టివ్ గా హౌస్ లో లేకుండా ఉండటం.. తో.. మొత్తానికి మూడవ వారమే లహరి ఇంటి నుండి దుకాణం సర్దేస్తున్న పరిస్థితి ఏర్పడిందని బయట టాక్. ఓవరాల్ గా అయితే ఎక్కువగా జనాలు యాంకర్ రవి.. కారణంగానే లహరి.. ఎలిమినేట్ అయినట్లు భావిస్తున్నారు. ఇలా ఉంటే త్వరలోనే ఇంటిలోకి ఓ వైల్డ్ కార్డు.. ఎంట్రీ ఉండే రీతిలో షో నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. హౌస్ లో గొడవలు పడే క్యాండెట్ చాలావరకు వెళ్ళిపోవడం తో పాటు చాలా చపాగ ఉంటున్నట్లు వార్త రావడంతో షో నిర్వాహకులు ఏమాత్రం టిఆర్పి రేటింగులు పడకుండా జాగ్రత్త తీసుకునే క్రమంలో కొత్త ఇంటిలోకి పంపించడానికి సరికొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.


Share

Related posts

మైదాన ప్రాంతంలో స్పైస్ జెట్ అత్యవసర ల్యాండింగ్

somaraju sharma

Animal Faithfulness: కరోనా వేళ మంటగలుస్తున్న మానవత్వం.. విశ్వాసం చాటుకుంటున్న మూగజీవాలు

bharani jella

మళయాళ సూపర్ హిట్ లో రానా .. రవితేజ ..!

GRK