Pushyami: పునర్వసు నక్షత్ర నాలుగు పాదాలు
పునర్వసు నక్షత్రమొదటి పాదం కుజుడి కి చెందినది. భక్తి కలిగినవారు , కన్నులు ఎర్రగా ఉంటాయి , కోపం కలవారు , మంచి ప్రవర్తన లేనివారు గా ఉంటారు.పునర్వసు నక్షత్ర రెండొవ పాదం శుక్రుడి (sukrudu ) కి సంబంధించింది. రక రకాల బట్టలు వేసుకోవడం మీద ఎక్కువ ప్రీతి ఉంటుంది. వీరు భోజన ప్రియులు కూడా , డబ్బుగలవారు .. శృంగార ప్రియత్వం కలిగి ఉంటారు.
పునర్వసు నక్షత్ర మూడోవ పాదం బుధుడి కి చెందినది . పండితుడు, లోభ స్వభావం కలిగి ఉంటారు. ఎప్పుడు ఎదో ఒక వ్యాధి పీడితులుగా ఉంటారు. వ్యాపార దక్షత ఉన్నవారు, శృంగార ప్రియత్వం కలవారిగా ఉంటారు. పునర్వసు నక్షత్ర నాల్గొవ పాదం చంద్రుడి కి చెందినది . బాగా డబ్బున్నవారు , ఉపకారం చేసే మనస్సు ఉన్నవారు,ఆడవారి మాటలను పాటించువారు, నిర్మలత్వం కలిగినవారు, ఆకర్షణ కలిగిన వారుగా ఉంటారు.
Pushyami: పుష్యమి నక్షత్ర నాలుగు పాదాలు
పుష్యమి నక్షత్రం మొదటి పాదం రవి కి చెందినది. వీరికి ఏకాంత మంటే ఇష్టం ,ఏ పని అయినా తొందరగా చేస్తారు. రోగం కలవారుగామరియు స్ధూల కాయం తో ఉంటారు.పుష్యమి నక్షత్రం రెండవ పాదం బుధుడి కి చెందినది. పరస్త్రీ వ్యామోహం ఉంటుంది. వారి వలన కోరి కష్టాలను తెచ్చుకుంటారు. ధనం మీద కోరిక కలిగి ఉంటారు.పుష్యమి నక్షత్రం శుక్రుడి కి సంబందించినది గా చెప్పబడింది. వీరు చాలా ప్రసన్నంగా ఉండడం తో పాటు భోగవంతులు, పరోపకార బుద్ధి కలిగినవారు, ఎప్పుడు మనశ్శాంతి పొంది ఉంటారు.పుష్యమి నక్షత్రం నాల్గవ పాదం కుజుడి కి చెందినది . వీరు సహజంగానే గొడవాలంటే ఇష్టపడుతుంటారు. ఇతరుల వస్తువులను అపహరిస్తూ ఉంటారు. పరస్త్రీల మీద ఆసక్తి కలవారు,