Rechipodam brother : రెచ్చిపోదాం బ్రదర్ Rechipodam brother అని అంటున్నాడు మన రాజీవ్ కనకాల. ఇంతకీ ఏమైంది అంటారా? రాజీవ్ కనకాల తెలుసు కదా. యాంకర్ సుమ భర్తగానే కాకుండా.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో మంచి పాత్రలు పోషించి.. తనకంటూ ఓ స్థానాన్ని తెలుగు సినిమా ఇండస్ట్రీలో పొందుపరుచుకున్నారు రాజీవ్ కనకాల.

అయితే.. ఈ మధ్య రాజీవ్ కనకాల.. ఆయన భార్య సుమ లాగానే ఎక్కువగా షోలలో కనిపిస్తున్నారు. ఈ మధ్య శ్రీదేవి డ్రామా కంపెనీ షోలను కనువిందు చేశారు. వేరే షోలలోనూ సుమతో కలిసి పార్టిసిపేట్ చేశారు.
మొత్తం మీద రాజీవ్ కనకాల.. బుల్లితెర మీద కూడా అడుగు పెట్టినట్టే లెక్క. అయితే.. తాజాగా రాజీవ్ కనకాల హోస్ట్ గా బుల్లితెర మీద మరో షో రాబోతోంది. దాని పేరే రెచ్చిపోదాం బ్రదర్.
Rechipodam brother : ఈటీవీ ప్లస్ లో త్వరలో ప్రారంభం
Rechipodam Brother : త్వరలో ఈటీవీ ప్లస్ చానెల్ లో ఈ షో ప్రారంభం కానుంది. ఫుల్ టు ఎంటర్ టైన్ మెంట్ ను ఇవ్వడం కోసమే ఈ షోను డిజైన్ చేశారు. జబర్దస్త్ కు చెందిన నటులతో పాటు టిక్ టాక్ దుర్గారావు, ఇతర కమెడియన్లతో కలిసి ఫుల్ టు కామెడీని జనరేట్ చేయనున్నారు ఈ షో ద్వారా.
తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. ప్రోమో మాత్రం అదిరిపోయింది. ట్రాక్టర్ మీద అందరూ కూర్చున్నారు. రాజీవ్ స్టీరింగ్ పట్టుకొని తిప్పుతున్నాడు. ఇంతలో ఓ ముసలాయనకు ట్రాక్టర్ ఢీకొంటుంది. ఏంటి.. అందరు ఎక్కడికి వెళ్తున్నరు అంటే.. రెచ్చిపోదాం బ్రదర్ షోకు అనగానే.. ఆ ముసలాయన కూడా వాళ్లతో పాటు ట్రాక్టర్ ఎక్కి వెళ్లిపోతాడు. మొత్తం మీద త్వరలో ప్రసారం కాబోయే ఈ షో.. ఎన్ని సంచలనాలను సృష్టిస్తుందో వేచి చూద్దాం.