Pista Kulfi :వేసవి వచ్చేసింది… ఎండలు మండి పోతున్నాయి.. చల్లగా తినేందుకు ఏమున్నాయా అని వెతుక్కునే వారికి కుల్ఫీ మంచి ఛాయిస్ గా చెప్పుకోవచ్చు. కుల్ఫీ పేరు చెప్పగానే చిన్న పిల్లల దగ్గర నుంచి…పెద్దవాళ్ల వరకూ నోట్లో నీరు రాని వారు ఎవరు ఉండరు..రక రకాల కారణాలతో చాలామంది బయట అమ్మే కుల్ఫీ ను తినడానికి ఆసక్తి చూపరు.. . అలాంటివారు వారి అభిరుచికి తగ్గట్టుగా రకరకాల కుల్ఫీ లు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు..
పిస్తాపప్పును వాడి కుల్ఫీలను ఎలా తయారు చేయాలో, తయారీకి ఏ పదార్థాలు అవసరమో తెలుసుకుందాం…
పిస్తాపప్పు(పొట్టు తీసినవి, పలుకులుగా చేయాలి)– అర కప్పు
పాలు – 1 లీటర్
చక్కెర – 250 గ్రాములు
బ్రెడ్ – ఒక ముక్క (అంచులు కట్ చేసుకోవాలి)
బాదంపప్పు (నీటిలో నానబెట్టి పొట్టు తీసినవి) – 20 యాలకులు – 4
కుంకుమ పువ్వు – 2, 3 రెబ్బలు
పిస్తా కుల్ఫీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
మనం తీసుకున్న లీటర్ పాలను అర లీటర్ అయ్యే వరకు బాగా మరిగించి చల్లర్చుకోవాలి.. అందులో పిస్తాపప్పు, చక్కెర, బ్రెడ్, బాదం పప్పు పొడి, యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి బాగా కలియబెట్టాలి. కుల్ఫీ మౌల్డ్‌లో ముందుగా కలుపుకుని ఉంచుకున్న మిశ్రమంపోసుకుని సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసుకుని ఐస్‌క్రీం పుల్లను పెట్టుకోవాలి. ఈ కుల్ఫీ మౌల్డ్‌ని దాదాపు 12 గంటల పాటు డీప్ ప్రిజ్‌లో ఉంచితే చల్ల చల్లని రుచికరమైన పిస్తా కుల్ఫీ రెడీ అయినట్టే. కుల్ఫీ తినాలనుకున్నప్పుడు కుల్ఫీ మౌల్డ్స్‌ను వేడి నీటిలో ముంచి తీస్తే కుల్ఫీలు తేలికగా బయటకు వచ్చేస్తాయి. వాటిని చల్లగా ఉన్నప్పుడే తినాలి. ఒకవేళ కుల్ఫీ మౌల్డ్స్ ఇంట్లో లేకపోతే చిన్న చిన్న గ్లాసులలో ఆ మిశ్రమం పోసి సిల్వర్ ఫాయిల్ తో కవర్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకున్న సరిపోతుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?