గిన్నీస్ రికార్డుకోసం అతిపెద్ద జల్లికట్టు

చెన్నై, జనవరి 20: జల్లికట్టు గిన్నీస్ బుక్‌లో స్ధానం సంపాదించనుంది. ఆదివారం తమిళనాడులోని పుదుకొట్టై జిల్లా విరాళీమలైలో ముఖ్యమంత్రి పళణిస్వామి జల్లికట్టు పోటీలను ప్రారంభించారు. రికార్డు కోసం అతిపెద్ద జల్లి కట్టును అధికారులు ఏర్పాటు చేశారు.
దీనికోసం 2500 ఎద్దులు, మూడువేలమంది యువకులు పాల్గొన్నారు.
నామక్కల్‌లో జరిగిన జల్లికట్టులో కొల్లిమలైకు చెందిన మణికంఠన్ ఎధ్దు ప్రమాదవశాస్తు బావిలో పడి మరణించింది. ఈ ఎద్దు వాడివాసల్ నుండి బయటకు రాగానే దాని వేగానికి భయపడి ఎవ్వరూ పట్టుకోలేకపోయారు. దీంతో ఎద్దు బయట ఉన్న బావిలోపడింది. అగ్నిమాపక సిబ్బంది దాన్ని బయటకు తీసి ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందింది.