రెడ్ .. ఎనర్జిటిక్ హీరో రాం నటించిన లేటెస్ట్ సినిమా. గత కొంతకాలంగా వరసగా ఫ్లాప్స్ తో ఉన్న రాం ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్నాడు. కెరీర్ బాగా డౌన్ ఫాల్ లో ఉన్నప్పుడు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ రాం తో ఇస్మార్ట్ శంకర్ లాంటి కంప్లీట్ మాస్ ఎంటర్టైనర్ ని తీసి భారీ హిట్ ఇచ్చాడు. రాం తో ఇప్పటి వరకు ఎంతో మంది దర్శకులు సినిమాలు తీశారు. కాని ఎవరూ రాం ని ఈ యాంగిల్ లో చూపించలేదు. ఊర మాస్ క్యారెక్టర్ లో పూరి చూపించిన విధానానికి రాం ఎనర్జీ తోడై భారీ సక్సస్ వచ్చేలా చేసింది.
ఇదే ఊపుతో మళ్ళీ మాస్ ఎంటర్టైనర్ నే చేయాలనుకున్న రాం తమిళ సూపర్ హిట్ తడం సినిమాని రీమేక్ చేయాలని డిసైడయ్యాడు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత అదే సక్సస్ కంటిన్యూ కావాలంటే ఈ సినిమా నే పర్ఫెక్ట్ అని భావించిన రాం పెదనాన్న స్రవంతి రవికిషోర్ వెంటనే తడం సినిమా రీమేక్ రైట్స్ ని కొని సెట్స్ మీదకి తీసుకు వచ్చారు. గతంలో రాం కి నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి రెండు సూపర్ హిట్స్ ఇచ్చిన కిషోర్ తిరుమల ఈ సినిమాని తెరకెక్కించాడు. కాగా ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కాని కరోనా లాక్ డౌన్ కారణంగా పోస్ట్ పోన్ అవుతూ వచ్చింది.
అయితే తాజాగా మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ అన్న సినిమాతో థియేటర్స్ లోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం తో పాటు ఫస్ట్ డే వసూళ్ళ పరంగా కూడా నిర్మాతలకి తృప్తి కలిగించింది. దాంతో ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికి ధైర్యం వచ్చి తమ సినిమాలని రిలీజ్ చేసేందుకు డేట్స్ లాక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నే ఎనర్జిటిక్ హీరో రాం కూడా తన లేటెస్ట్ సినిమా రెడి సినిమాని రిలీజ్ చేసేందుకు సంక్రాంతి పండుగ సీజన్ లో డేట్ లాక్ చేశాడు. జనవరి 14 న ఈ సినిమా థియేటర్స్ లొ సందడి చేయబోతోంది. ఇక తాజాగా ఈ సినిమాకి సెన్సార్ కార్యక్రమాలు పూర్తై U/A సర్టిఫికెట్ వచ్చింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?