న్యూస్ రివ్యూలు సినిమా

రివ్యూ : రెడ్ మూవీ – రామ్ పోతినేని

Share

ఈ సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ఏకైక క్రైమ్ థ్రిల్లర్ ‘రెడ్’. సస్పెన్స్ జోనల్ లో రామ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని స్రవంతి మూవీస్ బ్యానర్ పై స్రవంతి రవికిషోర్ నిర్మించారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మాళవిక శర్మ, అమృత అయ్యర్ హీరోయిన్లుగా కనిపించగా… నివేత పేతురాజ్ పోలీస్ రోల్ లో నటించింది. తమిళ సూపర్ హిట్ చిత్రం ‘తడాం’ రీమేక్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…

 

కథ – కథాంశం

ఆదిత్య, సిద్ధార్థ్ పాత్రలలో రామ్ కనిపిస్తాడు. సిద్ధార్థ సాఫ్ట్ గా ఉండే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాగా ఆదిత్య మాత్రం రఫ్ గా ఉండే క్యారెక్టర్. అనుకోని పరిస్థితుల్లో సిద్ధార్థ్, ఆదిత్య తమ జీవితంలో చిక్కుల్లోపడతారు. ఆర్థికంగా ఆదిత్యకు ఇబ్బందులు వస్తే సిద్ధార్థ మాత్రం ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. అదే సమయానికి వేరే కేసులో పోలీస్ స్టేషన్ లోకి వచ్చిన ఆదిత్య ను చూసి పోలీసులు కన్ఫ్యూజ్ అవుతారు. ఆకాశ్ అనే ఒక యువకుడిని వీరిద్దరిలో అసలు ఎవరు హత్య చేశారు అన్న విషయంపై కథ మొదలవుతుంది. ఇక వీరిద్దరిలో అసలైన నిందితుడు ఎవరు అని రుజువు చేసేందుకు పోలీసులు పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇదే సమయంలో వీరిద్దరి గతం తెలుస్తుంది. అసలు వీరిద్దరికీ చనిపోయిన వ్యక్తి కి సంబంధం ఏమిటి… కోర్టు నుండి తప్పించుకున్న వీరిద్దరిలో చివర్లో జరిగే భారీ ట్విస్ట్ ద్వారా అసలు నేరస్థుడు ఎవరు అన్నది పోలీసులకు తెలిసిందా లేదా అనేదే మిగిలిన కథాంశం…

ప్లస్ లు

  • రామ్ పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టేశాడు. ద్విపాత్రాభినయం లో రెండు పాత్రల మధ్య వ్యత్యాసం చాలా చక్కగా చూపించాడు. సినిమా మొత్తాన్ని ఒక రకంగా తన భుజాల పైన మోశాడు అనే చెప్పాలి.
  • స్క్రీన్ ప్లే చాలా బాగా ఉంటుంది. షార్ప్ ఎడిటింగ్ తో ప్రేక్షకులకు మంచి ఫీలింగ్ వస్తుంది.
  • రైటింగ్ లో ఉండే కొత్తదనం స్క్రీన్ పైన కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లీడ్ క్యారెక్టర్స్ కథాంశానికి చాలా బాగా సపోర్ట్ చేశారు. దీంతో ప్రేక్షకులకు పెద్దగా బోర్ కొట్టదు.
  • ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా నివేతా పేతురాజ్ రామ్ మధ్య సీన్లు చిత్రానికి హైలెట్. చివరి 20 నిమిషాలు చాలా బాగా తీశారు.

మైనస్ లు

  • సినిమా మధ్యలో వచ్చే కొన్ని అనవసరమైన సీన్లు ఫ్లో దెబ్బతీస్తాయి. వాటివల్ల ప్రేక్షకులకు ఆసక్తి కొద్దికొద్దిగా తగ్గిపోతుంది.
  • లీడ్ హీరోయిన్లు సినిమాకు పెద్ద మైనస్. గ్లామర్ తో అంతగా అలరించలేదు…. వారి పాత్రలకు ప్రాధాన్యత లేదు. కానీ నిడివి మాత్రం ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది
  • రెండవ అర్ధ భాగం మరింత గ్రిప్పింగ్ గా పెడితే బాగుండేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ విపరీతంగా సాగదీశారు.
  • వావ్ అనిపించే థ్రిలింగ్ మొమెంట్స్ కరువయ్యాయి. దర్శకుడు కొత్త సబ్జెక్ట్ ను రొటీన్ గా తీయడం అనేది చాలా అసంతృప్తిని మిగిలిస్తుంది.

సమీక్ష :

ఎనర్జిటిక్ హీరో రామ్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ కు తోడు…. కొత్త సబ్జెక్ట్ కావడంతో సినిమా మొదట్లో ప్రేక్షకులందరికీ ఎక్కువగా ఆసక్తి ఉంటుంది. అయితే టైట్ స్క్రీన్ ప్లే ఉన్నప్పటికీ దర్శకుడు అనవసరమైన సీన్లు స్టోరీ లోకి ఎంటర్ చేసి సినిమా బాగా దెబ్బ తీస్తాడు. సినిమా లేచే సమయానికి స్టోరీ రెండవ అర్ధ భాగంలో అనవసరమైన కామెడీ, విసుగు తెప్పించే ఫ్లాష్బ్యాక్ వల్ల థ్రిల్ అనేది మిస్ అవుతుంది. అప్పటికీ ఇన్వెస్టిగేషన్ చివరి అరగంటలో చోటుచేసుకునే ట్విస్ట్ తో మళ్లీ సినిమాను పట్టాలపైకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తాయి. అయితే అంతటి కొత్త తరహా బలమైన కథాంశమే క్లైమాక్స్ వరకు సీట్లలో కూర్చో పెడుతుంది. మొత్తానికి రెడ్ సినిమా ఒక కొత్త తరహా ప్రయోగం అనే చెప్పాలి. అయితే మరిన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కనుక జోడించి ఉంటే భారీ హిట్ అయి ఉండేది.

చివరి మాట : రెడ్ – నాట్ గుడ్… నాట్ బ్యాడ్


Share

Related posts

`సాహో` భామ నిశ్చితార్థం

Siva Prasad

Yash: ప్ర‌భాస్ హీరోయిన్‌పై మ‌న‌సు పారేసుకున్న య‌శ్‌.. ఆమె అంత ఇష్టమా?!

kavya N

గోదారిలో అలా.. దుర్గమ్మ దగ్గర ఇలా..!! టైం బ్యాడ్ బాబు..! టైం గుడ్ జగన్..!!

Srinivas Manem
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar