రెజీనా కసాండ్రా… చెన్నైకి చెందిన ఈ బ్యూటీ అటు తెలుగుతో పాటు కన్నడ, బాలీవుడ్ సినిమాల్లోనూ నటించి మంచి పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. పిల్లా నువ్వు లేని జీవితం అంటూ అభిమానుల గుండెల్లో సెగలు రేపి టాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఒకరకంగా స్టార్ హీరోయిన్ ల లిస్ట్ లో చేరడానికి రెజీనా చేయని ప్రయత్నం లేదు. హిట్స్ అండ్ ఫ్లాప్స్ మాట అటుంచితే, తనకిచ్చిన పాత్రకి న్యాయం చేస్తూ నటన పరంగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది రెజీనా. కానీ గత కొంత కాలంగా సినిమాలు లేక వెలవెలపోతుంది.
అయితే అనూహ్యంగా రానా – రెజీనా జంటగా ‘1945’ అనే సినిమా తెరకెక్కింది. తమిళ దర్శకుడు సత్యశివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళం.. హిందీ భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లుగా ఇంతక ముందే తెలిపారు. ఇక ఈ సినిమా చిత్రీకరణ నిలిచిపోనప్పటి నుంచి సరైన అప్డేట్ లేకపోవడంతో దాదాపు ప్రేక్షకులు ఈ సినిమా గురించి మరిచిపోయారన్నట్లే అనుకున్నారు. ఇలా మూడు సంవత్సరాల క్రితం మొదలై ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్ మళ్లీ పునః ప్రారంభం అవుతుందట. వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేసి విడుదల చేస్తాం అంటూ తెలుగు వర్షన్ నిర్మాత అయిన సి కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు.
కాగా రానా ఈ మూవీలో స్వాతంత్ర సమర యోధుడు అయిన సుభాష్ చంద్రబోస్ పాత్రలో కనిపిస్తున్డగా, అతడి ప్రియురాలిగా రెజీనా కనిపించనుది. ఇక రెజీనా ఆచార్య సినిమాలో చిరంజీవి తో స్పెషల్ సాంగ్ చెసింది. ఆ సాంగ్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అంటున్నారు. అంతేకాదు రెజీనాకి ఆ సాంగ్ చాలా మంచి పేరు తెస్తుందన్న టాక్ వచ్చేసింది. ఇపుడు రానా సినిమా రిలీజైతే మళ్ళీ రెజీనా టాలీవుడ్ లో టాప్ గేర్ వేసి ఇప్పుడున్న హీరోయిన్స్ కి పోటీ రావడం పక్కా అని ఇండస్ట్రీలో అనుకుంటున్నారట.