Relationship Advice: ఇలాంటి సందర్భాల్లో ఏకాంతంగా వదిలేయాల్సిందే..!

Share

Relationship Advice: సాధారణంగా దంపతులు ఎప్పుడూ కలిసే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో తమకు కొంత సమయం కావాలని కరాఖండిగా చెబుతారు. జీవిత భాగస్వామికి దూరంగా ఉంటూ ఏకాంతంగా కొంత సమయాన్ని గడపాలని వారికి ఉంటుంది. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు వారు ఏకాంతమైన సమయమే తమకు ఉపశమనం కలిగిస్తుందని భావిస్తుంటారు. అయితే కొందరు ఈ విషయాన్ని స్ట్రెయిట్ గా చెప్తే మరికొందరు మాత్రం ఈ విషయాన్ని చెప్పకుండా దాచి పెడుతున్నారు. ఏమైందని అడిగినా కూడా వాళ్లు తమ భావనలను బయట పెట్టరు. దీంతో అవతలి వ్యక్తి అపార్థం చేసుకొని వారితో గొడవ పడే అవకాశం ఎక్కువ. అయితే అసలు విషయం గురించి సూటిగా చెప్పకపోయినా అవతలి వ్యక్తి తమ జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవచ్చని అంటున్నారు రిలేషన్‌షిప్‌ నిపుణులు. ముఖ్యంగా కొన్ని సందర్భాల్లో జీవితభాగస్వామికి ఏకాంత సమయం గడిపేందుకు వీలు కల్పించాలని అంటున్నారు. ఆ సందర్భాల్లో ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Relationship Advice: ఏకాంతంగా వదిలేయాల్సిన సందర్భాలివే


‘ఐ నీడ్ సమ్‌ స్పేస్’ అని జీవిత భాగస్వామి చెప్పగానే ఎందుకు? ఎందుకు? అని గుచ్చి గుచ్చి అడుగుతూ సతాయించకూడదు. సాధారణంగా చాలామంది ఆఫీసుకు వెళ్లొచ్చాక తమ జీవిత భాగస్వామితో సరదాగా సమయం గడుపుతారు. కానీ ఒక్కోసారి చెప్పుకోలేని సమస్యల వల్ల ఇంటికి వచ్చాక జీవిత భాగస్వామికి దూరంగా ఉంటూ ముభావంగా ఉండిపోతారు. అయితే వారు ఎందుకు మాట్లాడటం లేదో అవతల వ్యక్తి తెలియక ఏమైంది అంటూ ఇబ్బంది పెట్టొచ్చు. ఇలా తరచూ అడిగితే జీవిత భాగస్వామికి కోపం రావచ్చు. అది కాస్తా పెద్ద గొడవకి దారి తీయవచ్చు. అందుకే ఏమైంది అని ఎక్కువసార్లు అడగకూడదు. ఒకవేళ జీవిత భాగస్వామి తమ సమస్య ఏంటో చెప్తే దాన్ని పరిష్కరించడానికి మీకు సాధ్యమైనంత సహకారం అందించండి. అంతేగానీ సమస్య ఏంటి? అంటూ సతాయించకండి. ఆఫీస్ కి వెళ్లి వచ్చాక సహోద్యోగులు, బాసు ఇలా ఎవరితోనో ఒకరితో చిన్న మనస్పర్ధలు రావొచ్చు. వాటి వల్ల వారు కలతచెంది ప్రశాంతత కోసం దూరంగా ఉండొచ్చు. ఇలా చాలా సమస్యలు ఉంటాయి కాబట్టి వారితో సున్నితంగా ప్రవర్తించడం ముఖ్యం.

ఒకరిపై కోపం మరొకరిపై చూపించడం

ఉద్యోగానికి వెళ్లి వచ్చిన తర్వాత ఎవరి మీదో కోపం తమ జీవిత భాగస్వామి పై చాలామంది చూపిస్తుంటారు. చిన్న విషయాలకే వారికి ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఇలాంటి సందర్భాల్లో జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవాలి. వారిని సమస్య ఏంటో అడిగి శాంతంగా సర్ది చెప్పాలి.. లేదంటే వారిని ఏకాంతంగా వదిలేయడమే మంచిది. ఇలా కాకుండా వారితో వాదనకు దిగితే పెద్ద గొడవలు అయ్యే ప్రమాదం ఉంది.

ప్రామిస్ ఇచ్చి నిలుపుకోలేకపోతున్నారా?

కొందరు తమ భాగస్వామితో డిన్నర్‌కు వెళ్లాలనో, రెస్టారంట్ కు వెళ్లాలనో ప్లాన్ చేసుకుంటారు. ఫలానా రోజున తీసుకెళ్తామని ప్రామిస్ కూడా. కానీ ఆ ప్రామిస్ నిలబెట్టుకోకుండా దాన్ని వాయిదా వెయ్యొచ్చు. ఇందుకు చాలా కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి లేదా ఆరోగ్య సమస్యలు ఇలా ఏదైనా కావచ్చు. అందువల్ల జీవితభాగస్వామి తరచూ తన మాటను వాయిదా వేసుకుంటే పడకుండా అసలు కారణమేంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆలుమగలు అన్న తర్వాత ఈ మాత్రం అర్థం చేసుకోకపోతే ఆ బంధం కల కాలం పాటు సాగడం కష్టమే అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు.

అకారణంగా వాదనకు దిగుతున్నారా?

కొందరు అకారణంగానే తమ జీవిత భాగస్వామితో గొడవ పడుతుంటారు. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు కానీ ఆ గొడవలకి ప్రతిస్పందనగా గొడవలు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. అందువల్ల అసలు సమస్యను సామరస్యంగా, శాంతంగా పరిష్కరించకుంటే మంచిది.


Share

Related posts

Gannavaram : గన్నవరం ఎయిర్ పోర్టులో తృటిలో తప్పిన పెను ప్రమాదం

somaraju sharma

Prabhas: ఆ కంట్రీలో భారీ బంగ్లా కొంటున్న ప్ర‌భాస్‌.. ఖ‌రీదు తెలిస్తే కళ్ళు తేలేస్తారు!

kavya N

MAA Elections: ఏదీ మర్చిపోలేదు.. అందుకే పోటీ చేస్తున్నా: జీవిత రాజశేఖర్

Muraliak