Relationship భార్యాభర్తలు సంతోషంగా ఉండాలంటే ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం తీసుకోవాలంటున్నారు మానసిక నిపుణులు. ఒక కుటుంబం గా జీవితం మొదలు పెట్టిన తర్వాత ఆర్థిక ఇబ్బందులు వచ్చిన, ఇతరములైన సమస్యలు ఏవి వచ్చిన కూడా భార్యాభర్తలు ఒకరి మనోభావాలకు అనుగుణంగా మరొకరు సర్దుకుపోతే అసలు సమస్యలుండవు జీవితం సుఖంగా ఉంటుందనితెలియచేస్తున్నారు
భార్య లేదా భర్త ఇద్దరిలో ఎవరో ఒకరు ఆనందంగా ఉంటే రెండో వారి ఆరోగ్యం చాలా బాగుంటుందని ఇటీవల చేసిన పరిశోధనలో తేలింది.
కాబట్టి భార్యాభర్తలు మూడీగా ఉండకుండా.. భాగస్వామిని ఉత్సాహపరిచే విధంగా మాట్లాడుతూ ఉంటే ఆరోగ్యంతో పాటు మానసిక పరిస్థితి కూడా బాగుంటుంది అని పరిశోధకులు తెలిపారు. ఉదాహరణకు భర్త ఆఫీస్ లో సమస్య వచినప్పు అదే పనిగా దాని గురించి అలోచించి ఆందోళన చెందుతుంటే… ఆటోమేటిక్ గా భార్య కూడా ఆందోళన చెంది ఆరోగ్యం పాడు చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే భార్యకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు భర్త మీద ఆ ప్రభావం ఉంటుంది.
కాబట్టి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాని గురించి మాట్లాడుకుని అక్కడితో వదిలేయగలిగితే భార్యాభర్తలు సంతోషంగా ఉండి అనారోగ్య సమస్యలు వారి దగ్గరకు రాలేవని నిపుణులు అంటున్నారు.అందుకోసం ఇద్దరు ధ్యేర్యం కలిగి ఉండాలి. ఈ సమస్యలు మనల్ని ఏమి చేయవు.. ఎలా వచ్చాయో అలా వెళ్లిపోతాయి అనే ధ్యేర్యం ఇద్దరిలో ను ఉండాలి. లేదంటే ఒకరి భయం ఇంకొకరి ఆరోగ్యాన్ని కచ్చితం గా పాడుచేస్తుంది అని గుర్తు పెట్టుకోండి. ఈ విధానం పడుచు , మధ్య వయసు లేదా వృద్ధ జంటల్లో ఎవరికైనా వర్తిస్తుందని తెలియచేస్తున్నారు. భాగస్వాము ల్లో ఒకరు సరదా స్వభావం కలవారైతే అది తోటి వారి ఆరోగ్యాన్ని కూడా ఎంతగానో ప్రభావితం చేయగలదట.
స్వతహాగా సంతోషంగా ఉండేవారికి భార్య లేదా భర్త కూడా ఆనందంగా ఉండేవాళ్ళు ఉంటే ఇక ఆ వ్యక్తుల ఆరోగ్యానికి ఎలాంటిసమస్య ఉండదని పరిశోధకులు తెలియచేస్తున్నారు.ఎన్ని సమస్యల్లో ఉన్న పాజిటివ్ గా తీసుకునే వారయితే.. ఇతరుల ను సంతోషంగా ఉంచి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపిస్తారు.. దాంతో తోబాటు సామాజిక సంబంధాలు కూడా బాగుంటాయి అని పరిశోధకులు తెలియచేస్తున్నారు.