Relationship tips:కొందరు ఎవరినైనా ప్రేమిస్తే.. జీవితాంతం వారిపై విశ్వాసం ఉంచేవారు. వారి ప్రేమలో నిజాయితీ ఉండేది.అందుకే వారి ప్రేమలు చరిత్రలో నిలిచిపోయాయి. ఇంకొందరు ప్రేమ అని చెప్పి కొంత ప్రయాణం సాగిన తర్వాత పక్క చూపులు చూస్తుంటారు… భాగస్వామి ని మోసం చేసేస్తూ ఉంటారు. అయితే ఇలా చేసి వారిని మనం ముందే తెలుసుకోలేమా ? మన భాగస్వామి మోసం చేస్తున్నారని ముందే తెలుసుకుంటే మనం ఆ బంధం నుంచి బయటపడే ప్రయత్నం చేయవచ్చు .
ఏదైనా సందర్భం లో మీ భాగస్వామిపై ఏదైనా అనుమానం గా అనిపించినప్పుడు .. తన ప్రవర్తన మరియు సోషల్ మీడియా అకౌంట్లు ఇతర మార్గాల పై కూడా దృష్టి పెట్టి గమనిస్తూ ఉండండి. మీ భాగస్వామి మీ పై ఎప్పుడైతే ఆసక్తి తగ్గిస్తూ పోతారో.. మిమ్మల్ని గౌరవించకపోవడం లేదా మీకు తగిన ప్రాముఖ్యత ఇవ్వకపోయినా పరోక్షంగా ఇబ్బంది పెడుతున్నా.. వాడకూడని పదాలు వాడిన మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా భావించొచ్చు.
మీరు ముఖ్యమైన విషయాల గురించి తనతో మాట్లాడాలనుకున్నప్పుడు .. తను పరధ్యానంలో మీరు చెప్పే విషయాన్ని పట్టించుకోకపోవడం.. మీ మాటలు పై ఆసక్తి చూపకపోవడం.. మీరు మాట్లాడుతున్నంత సేపు ఫోన్ చూస్తుండడం.. ఫోన్ పై ఎక్కువ శ్రద్ధ చూపడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. వారు మీకు దూరమవుతున్నారు అని అర్థం చేసుకోవచ్చు.మీరు ఫోన్ చేసినా పట్టించుకోకపోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. తను మిమ్మల్ని మోసం చేస్తున్నాడని భావించొచ్చు.మనుషులన్నాక తప్పులు చేయని వారంటూ ఎవరు ఉండరు.
అయితే ఎవ్వరైనా కూడా తప్పు జరిగిన ప్రతి సారి క్షమించమని అడిగి తీరవలసిందే. కానీ అతను చేసిన తప్పుకి క్షమాపణ చెప్పకుండా.. దాని నుండి తప్పించుకోడానికి మీ పై నిందలు వేయడం.. మిమ్మల్ని విమర్శించడం వంటివి చేస్తూ వారి తప్పులు తప్పులుగా అంగీకరించకపోవడం తన తప్పు లేదని చెప్పేందుకు అడ్డదారులు తొక్కడం వంటివి చేస్తుంటే మాత్రం మీ భాగస్వామి మిమ్మల్ని మోసం చేస్తున్నట్టుగా గుర్తించాలి.
మిమ్మల్ని తమ కోసం మారి పోమని చెప్పడం.. మీ ఇష్టాలు ఎగతాళి చేయడం.. మీ వ్యక్తిత్వాన్ని గౌరవించకపోవడం వంటి లక్షణాలు మీ భాగస్వామి ఉంటే మాత్రం మీరు ఎప్పటికీ తనతో కలిసి ఉండలేరు.మీరు మీ భాగస్వామి కలిసి ఎక్కడికైనా బయటకు వెళ్లినప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళినప్పుడు ఎందరిలో మిమ్మల్ని ఎగతాళి చేయడం.. మిమ్మల్ని చాలా హీనంగా చూడటం తో పాటు మీపై పదే పదే కోప్పడడం వంటి లక్షణాలు మీ భాగస్వామిలో కనిపిస్తే.. ఇంక మీరు మీ జీవితం గురించి ఆలోచించాల్సిందే..