ఉప్పెన సినిమాని రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్సైనట్టు తెలుస్తోంది. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ నటించిన డెబ్యూ సినిమా uppena. కృతిశెట్టి హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం అవుతోంది. సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు ఈ సినిమాతో దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇక సుకుమార్ – మైత్రీ మూవీ మేకర్స్ కలిసి ఈ సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. కాగా uppena అన్నీ కార్యక్రమాలని కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీగా ఉంది. రాక్ స్టార్ దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిచిన సాంగ్స్ ఇప్పటికే ట్రెండింగ్ లో రికార్డ్స్ సాధిస్తున్నాయి.
అయితే ఈ సినిమా రిలీజ్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ కి ముందే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఆగిపోయింది. మధ్యలో చాలా సార్లు ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కాని మేకర్స్ మాత్రం మెగా ఫ్యామిలీ హీరో డెబ్యూ సినిమా కావడం వల్ల ఈ సినిమాని థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. ఇక uppena సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారన్న ప్లాన్ చేసి కూడా నిలిపేశారు. దాంతో అందరు లవ్ స్టోరీ కాబట్టి ఫిబ్రవరి 14 న రిలీజ్ అవుతుందని చెప్పుకున్నారు. తాజా సమచారం ప్రకారం ఫిబ్రవరి 14 న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారని సమాచారం.
అయితే నిన్నా.. మొన్నటి వరకు ఈ సినిమా ఫిబ్రవరి 5 న రిలీజ్ చేసేందుకు డేట్ ఫిక్స్ చేశారన్న మాట కూడా వినిపిస్తోంది. మరి అఫీషియల్ గా ఎప్పుడు uppena థియేటర్స్ లోకి వస్తుందో చూడాలి. ఇక vishnav tej క్రిష్ దర్శకత్వంలో నటించిన సినిమా కూడా త్వరలోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగున్నాయి. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించింది. సమ్మర్ లోపు మాత్రం vishnav tej నటించిన రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఇక ఈ మేగా మేనల్లుడు మరికొన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నాడు.
Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా సత్తా చాటుతున్న టాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ప్రభాస్ వరుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…
Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…
Shriya Saran: అందాల భామ శ్రియ సరన్ గురించి పరిచయాలు అవసరం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…
CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…
Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగర్`. డాషింగ్ అండ్ డైనమిక్…
Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…