RRR: ఆర్ఆర్ఆర్ దెబ్బ..రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలన్ని సైడ్ అవుతున్నాయి..!

TFI vs AP Government: Key Decisions May Damage Big Movies
Share

RRR: ఆర్ఆర్ఆర్..ప్రపంచవ్యాప్తంగా 2022, సంక్రాంతి సందర్భంగా జనవరి 7న రిలీజ్ కాబోతున్న భారీ బడ్జెట్, మల్టీస్టారర్ పాన్ ఇండియన్ సినిమా. ఈ సినిమా కోసం ఏడాది నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు మాత్రమే కాదు ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి సినిమా అంటే మార్కెట్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించడం చాలా కష్ఠం. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమ రేంజ్ ఏంటో చూపించిన రాజమౌళి అదే సమయంలో దర్శకుడిగా తన సత్తాను చూపించారు.

 

 

ఆయన సినిమాకు ఉండే మార్కెట్ రేంజ్ కూడా బాహుబలి సినిమాతో మరింత గొప్పగా తెలిసింది. అందుకే ఇప్పుడు అన్నీ సినిమాలు బాక్సాఫీస్ బరినుంచి తప్పని పరిస్థితుల్లో తప్పుకుంటున్నాయి. ఒక భారీ ప్రాజెక్ట్ వస్తుందంటే సహజంగానే ఆ సినిమా రిలీజయ్యాక కనీసం రెండు నుంచి మూడు వారాలకు ఏ సినిమా పోటీ ఉండకూడదు. అలా జరిగితే ఆ భారీ చిత్రం మీద వసూళ్ళ పరంగా తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇక ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా అంటే ఎంతగా ప్రభావం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

RRR: ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల మళ్ళీ కొత్త డేట్ చూస్తున్నారట.

అందుకే సేఫ్ సైడ్‌గా ముందుగానే ఆర్ఆర్ఆర్ సినిమా తాకిడికి తట్టుకోలేక ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకున్న సినిమాలు కూడా ఒక్కొక్కటిగా కాంప్రమైజ్ అయి తప్పుకుంటున్నాయి. వాస్తవంగా అన్నిటికంటే ముందే సూపర్ స్టార్ మహేశ్ బాబు తన సర్కారు వారి పాట సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించాడు. ఆల్రెడీ డేట్ కూడా లాక్ చేసుకున్నాడు. 2022, సంక్రాతి జనవరి 13న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేశ్ నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. భారీ అంచనాలున్న ఈ సినిమా రిలీజ్ డేట్ మార్చుకొని 2022 ఏప్రిల్ 1న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.

release date locked movies are going side is it because of RRR
release date locked movies are going side is it because of RRR

ఇక క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరి హర వీరమల్లు సినిమాను ముందు సంక్రాంతికి రీసుకు రావాలనుకున్నారు. కానీ కరోనా సెకండ్ వేవ్ వల్ల ప్లాన్ తారుమారై పోస్ట్ పోన్ అయింది. అయితే సంక్రాంతికి భీమ్లా నాయక్ రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. రానా మరో హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను జనవరి 12 రిలీజ్ చేయాలనుకున్నారు. డేట్ కూడా ప్రకటించాక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీ వల్ల మళ్ళీ కొత్త డేట్ చూస్తున్నారట.

RRR: ఆర్ఆర్ఆర్ మాత్రమే క్యాష్ చేసుకుంటే మిగతా సినిమాల పరిస్థితేంటి..?

ఇదే కాదు ప్రభాస్ – పూజా హెగ్డే జంటగా యంగ్ డైరెక్టర్ రాధకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న రాధే శ్యామ్ సినిమా కూడా 2022, సంక్రాతికి జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్‌కు వారం గ్యాప్‌లోనే రాధే శ్యామ్ సినిమా రిలీజ్ కాబోతుండటంతో రాజమౌళి అభ్యర్థన మేరకు ఇది కూడా పోస్ట్‌పోన్ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అయితే సంక్రాంతి అనేది తెలుగు సినిమాలకు మంచి సీజన్. వసూళ్ళ పరంగా బాగా కలిసివచ్చే పండుగ. ఇప్పుడు ఈ సీజన్‌ను ఒక్క ఆర్ఆర్ఆర్ మాత్రమే క్యాష్ చేసుకుంటే మిగతా సినిమాల పరిస్థితేంటనేది ఇప్పుడు అందరిలో కలుగుతున్న ఆలోచన.


Share

Related posts

Soundariya Nanjundan Cute Looks

Gallery Desk

చింతమనేని X అబ్బయ్య వద్దు..! కొత్త “కమ్మ” కావాల్సిందే..!! గ్రౌండ్ రిపోర్ట్

Srinivas Manem

Twitter: ఇండియా లో మహిళలు ట్విటర్ ను దేనికోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నారంటే !!!

Naina