NewsOrbit
న్యూస్

రిలయన్స్ జియో-గూగుల్ కలయిక.. అద్భుతాలు చేస్తాయా!

Jio TV : Chandrababu Scam welcomes Ambanis Jio

భారత వ్యాపార దిగ్గజం జియో ప్లాట్ ఫామ్స్ తన స్పీడ్ పెంచుతున్నట్టే కనబడుతోంది. ఏకంగా గూగుల్ నే ఆకర్షిస్తోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లో డిజిటల్‌, టెలికం విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌లో 4 బిలియన్‌ డాలర్లు (30,000 కోట్లు) ఇన్వెస్ట్‌ చేసే యోచనలో గూగుల్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు చర్చలు జరుగుతున్నాయని అంటున్నాయి మార్కెట్ వర్గాలు.

reliance and google joint plans
reliance and google joint plans

 

వచ్చే ఏడేళ్లలో దేశీయంగా 10 బిలియన్‌ డాలర్లను ఇన్వెస్ట్‌ చేయాలని భావిస్తున్నట్టు ఇప్పటికే గూగుల్ వెల్లడించిన సంగతి తెలిసిందే. డిజిటల్‌ టెక్నాలజీస్‌లో మరింత విస్తరించాలనేదే తమ ఉద్దేశమని చెప్పుకొచ్చింది. దీనిపై ఆర్‌ఐఎల్‌, గూగుల్‌ ఇప్పటికీ ఏమీ స్పందించలేదు. ఈ నేపథ్యంలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్ ఎన్‌ఎస్‌ఈలో 1 శాతం బలహీనపడి రూ.1915 వద్ద ట్రేడ్ వుతోంది. ఇంట్రాడేలో రూ. 1942 వద్ద గరిష్టంగా.. రూ.1887 వద్ద కనిష్టంగా ఉంది.

 

జియో ప్లాట్‌ఫామ్స్‌లో చిప్‌ దిగ్గజం క్వాల్‌కామ్‌ రూ.730 కోట్లు ఇన్వెస్ట్‌ చేసింది. దీంతో జియోలో 0.15 శాతం వాటా సొంతం చేసుకున్నట్టైంది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో 25.24 శాతం వాటాను విక్రయించడం ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ.1.18 లక్షల కోట్ల వరకూ సమీకరించింది. ఇప్పటికే జియోలో ఫేస్‌బుక్‌ తో సహా చిప్ కంపెనీలు ఇంటెల్‌, క్వాల్‌కామ్‌.. పీఈ సంస్థలు కేకేఆర్‌, సిల్వర్‌ లేక్‌ ఇన్వెస్ట్‌ చేసాయి. ఈ పెట్టుబడులతోపాటు రైట్స్‌ ఇష్యూ ద్వారా ఆర్‌ఐఎల్‌ రూ. 53,124 కోట్లు సమకూర్చుకుంది. గతేడాది ఇంధన రిటైల్‌ నెట్‌వర్క్‌లో 49 శాతం వాటా అమ్మకం ద్వారా బీపీ నుంచి రూ. 7,000 కోట్లు సమీకరించింది. దీంతో రుణరహిత కంపెనీగా ఆర్ఐఎల్ ఆవిర్భవించినట్లు గత నెలలో తెలిపింది.

author avatar
Muraliak

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju